'పుష్ప-2' మూవీ లిరీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతి ఘటన తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీనిపైనే డిస్కషన్ నడుస్తోంది. అభిమానం పేరుతో జనాలు ఇలా ప్రాణాలు మీదకు తెచ్చుకోవడం అనేది మన తెలుగు రాష్ట్రాల్లో చాలా సార్లు జరిగింది. అయినా కూడా ఈ ధోరణి ఏమాత్రం మారడం లేదు. కాగా గతంలో జరిగిన ఇలాంటి పలు సంఘటనల గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో 'సలార్' సినిమా విడుదల సందర్భంగా.. రంగా సినీ కాంప్లెక్స్ ఎదుట ఓ ఇంటిపై ఫ్లెక్సీ కడుతూ హీరో ప్రభాస్ అభిమాని బాలరాజు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. లార్ సినిమా విడుదల సందర్భంగా స్నేహితులతో కలిసి ప్రభాస్ ఫ్లెక్సీ తయారు చేయించాడు. అనంతపురం నుంచి బాలరాజు స్నేహితులు, ప్రభాస్ అభిమానులు ధర్మవరం వచ్చారు. స్వయంగా వారే కడుతుండగా ఫ్రేమ్‌కు ఉన్న ఇనుప చువ్వ ఇంటిపై ఉన్న కరెంటు తీగలను తాకడంతో బాలరాజు కరెంట్ షాక్‌తో అక్కడికక్కడే మృతి చెందాడు. ఆంధ్రప్రదేశ్‌లో తమిళ హీరో సూర్య పుట్టిన రోజు సందర్భంగా ఫ్లెక్సీలు కడుతుండగా కరెంట్ షాక్ తగిలి ఇద్దరు అభిమానులు మరణించారు. ఈ సంఘటన పల్నాడు జిల్లాలో జరిగింది. Also Read : 'పుష్ప2' తర్వాత బన్నీకి సినిమాల్లేవ్.. కారణం ఇదే? కర్ణాటకలోని కోలార్ జిల్లాలో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ వార్ సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. పవన్ కల్యాణ్ కు వీరాభిమాని అయిన తిరుపతికి చెందిన వినోద్ రాయల్ కి జూనియర్ ఎన్టీఆర్ అభిమాని మధ్య చర్చ జరిగింది. తమ హీరో గొప్ప అంటే, కాదు తమ హీరో గొప్ప అంటూ వారిద్దిరూ గొడవకు దిగారు. ఈ క్రమంలో ఆగ్రహావేశాలకు గురైన జూనియర్ అభిమాని వినోద్ ను కత్తితో పొడిచాడు. దీంతో వినోద్ అక్కడికక్కడే మృతి చెందాడు. రామ్‌చరణ్ హీరోగా నటించిన "గోవిందుడు అందరివాడేలే" సినిమా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఈ సినిమా టిక్కట్ల కోసం ప్రయత్నించిన రామ్‌చరణ్ అభిమాని కన్నయ్య అక్కడ జరిగిన తొక్కిసలాట సందర్భంగా ఊపిరి ఆడక చనిపోయాడు. 'బింబిసార' ప్రీ రిలీజ్ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా వస్తున్నాడు అని తెలియడంతో నందమూరి ఫ్యాన్స్ ఉత్సాహంతో పరుగులు పెట్టారు. బయట వర్షాన్ని కూడా లెక్కచేయకుండా నందమూరి అభిమానులు శిల్పా కళావేదికకు చేరుకున్నారు. ఎన్టీఆర్ ను చూసేందుకు ఈ ఈవెంట్ కి వచ్చిన ఓ అభిమాని అక్కడి తొక్కిసలాటలో అనుమాస్పద స్థితిలో మృతి చెందాడు. ఎన్టీఆర్ నటించిన 'బాద్ షా' ఆడియో వేడుకల్లో ఆపశృతి చోటు చేసుకుంది. మణికొండలోని రామానాయుడు స్టూడియోలో ఈ వేడుకలు ఏర్పాటయ్యాయి. ఈ వేడులకు జూ. ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో వరంగల్‌లోని ఉరుసుగుట్టకు చెందిన రాజు అనే అభిమాని ఊపిరి ఆడక మృతి చెందాడు. Also Read : సుకుమార్ ఆ సినిమాను మొదట బన్నీతో చేయాలనుకున్నాడా? అప్పట్లో ఈ ఘటన ఇండస్ట్రీలో పెద్ద వివాదం అయింది. అయితే అభిమాని మృతి తర్వాత ఎన్టీఆర్ బాధిత కుటుంబాన్ని కలిశాడు. కుటుంబానికి అండగా ఉంటానని మాట ఇచ్చాడు. 11 ఏళ్లుగా ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్నాడు. నేటికి కూడా ఆయన తన అభిమాని కుటుంబ బాధ్యతను తానే భుజాన వేసుకున్నాడు. కాగా.. నిర్మాత బండ్ల గణేశ్ అభిమాని కుటుంబానికి రూ. 5 లక్షలు అందజేశాడు. చెప్పుకుంటూ పోతే ఇలాంటి ఘటనలు చాలానే ఉన్నాయి. టెక్నాలజీ ఇంతగా డెవలప్ అయిన ఈ కంప్యూటర్ కాలంలో అభిమానం అనే ఈ పిచ్చి సరైంది కాదని పలువురు భావిస్తున్నారు. అంతేకాకుండా హీరోలు సైతం ఇలాంటి సంఘటనలు మళ్ళీ రిపీట్ అవ్వకుండా తగిన జాగ్రత్తలు వహిస్తే బాగుంటుంది. అలా కాదని అభిమానులు 'నా హీరో నా హీరో అని విర్రవీగితే పోయేది మీ ప్రాణాలే తప్ప హీరోలకు ఒరిగేది ఏం లేదు... Also Read: విజయ్ దేవరకొండ ఫ్యామిలీతో 'పుష్ప2' చూసిన రష్మిక.. ఫొటో వైరల్ Also Read : 'పుష్ప2' జాతర ఎపిసోడ్.. ఆడియన్స్ రెస్పాన్స్ చూసి మురిసిపోయిన బన్నీ, వీడియో వైరల్