'పుష్ప2' సినిమా ప్రీమియర్ షోలో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్ RTC క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో తొక్కిస లాట జరిగిన విషయం తెలిసిందే. ఇందులో రేవతి అనే మహిళ మృతి చెందారు. ఆమె కుమారుడు శ్రీతేజ అస్వస్థతకు గురయ్యాడు. ఈ ఘటనపై తాజాగా అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. ఇది నిజంగా దురదృష్టకరమని తెలిపింది.' నిన్న రాత్రి సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటన నిజంగా దురదృష్టకరం. ప్రస్తుతం బాలుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. మా బృందం ఆ కుటుంబాన్ని కలిసి అవసరమైన సహాయాన్ని అందజేస్తాం..' అని తెలిపింది. Also Read: రేపే పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్.. టైమింగ్స్ ఇవే! అసలేం జరిగిందంటే.. నిన్న రాత్రి హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని సంధ్య థియేటర్ లోనూ 'పుష్ప 2' ప్రీమియర్ షోష్ ప్రదర్శించారు. ఈ ప్రీమియర్ షో చూసేందుకు అల్లు అర్జున్ కూడా రావడంతో థియేటర్ దగ్గరకు భారీ సంఖ్యలో ఫ్యాన్స్ వచ్చారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీఛార్జి కూడా చేయాల్సి వచ్చింది. అయినా పరిస్థితి అదుపులోకి రాలేదు. ఈ క్రమంలో జరిగన తొక్కిసలాటలో రేవతి, ఆమె కుమారుడు శ్రీతేజ కిందపడిపోయారు. పోలీసులు వారిని గమనించి సీపీఆర్ చేసిన ఫలితం దక్కలేదు. దగ్గర్లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రేవతి కన్నుమూసింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ ప్రస్తుతం నిమ్స్‌లో చికిత్స పొందుతున్నాడు. Also Read: రైల్వే ప్రయాణికులకు తీపి కబురు.. ఇక నుంచి ఆ బాధపడనవసరం లేదు! Also Read: పురుషులకు నెలసరి వస్తే తెలిసేది.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు Also Read: భారత మొదటి ప్రైవేట్ శాటిలైట్ ఆపరేటర్‌గా హైదరాబాద్ కంపెనీ..