ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ బడ్జెట్ సినిమా "పుష్ప2". డిసెంబర్ 5న అంటే రేపు గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ఇవాళ యూఎస్ సహా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మరికొన్ని రాష్ట్రాల్లో ఈ మూవీ ప్రీమియర్స్ పడనున్నాయి. Also Read: ఫడ్నవీస్ కే పట్టం.. ఆయనను మళ్లీ సీఎం చేసిన 6 ముఖ్య కారణాలివే! ఈ సినిమా చూసేందుకు ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దీంతో ఉదయం నుంచి థియేటర్ల చుట్టూ పండుగ వాతావరణం ఏర్పడింది. ఫ్లెక్సీలు, పూల తోరణాలు, భారీ ఎత్తు కటౌట్లతో థియేటర్ల వద్ద హంగా మారుమోగిపోయింది. భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..! దాదాపు 80 దేశాలలో 6 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ తరుణంలో ఈ మూవీకి సంబంధించి ఓ అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో చేసినట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో నిర్మించిన ఈ చిత్రం రూ.1,000 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం. దీంతో ఈ సినిమా ఇప్పుడే ఇన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే.. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత టాక్ మంచిగా వస్తే ఇంకెన్ని కోట్లు వసూళు చేస్తుందో అని చర్చించుకుంటున్నారు. నటీ నటుల రెమ్యూనరేషన్ Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది? ఇదిలా ఉంటే ఈ మూవీ నటీనటులు, సిబ్బందికి సంబంధించిన రెమ్యూనరేషన్లు కూడా ఈ మధ్య బాగా వైరల్ అయ్యాయి. ఈ మూవీలో హీరోగా నటించిన అల్లు అర్జున్ ఈ సినిమాకి రెమ్యూనరేషన్ కాకుండా.. లాభాల్లో వాటా తీసుకోనున్నాడు. దీని బట్టి చూస్తే అతడు రూ.270 కోట్ల నుంచి రూ.280 కోట్ల మధ్య సంపాదించే అవకాశం ఉందని తెలుస్తోంది. Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..! అలాగే ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించిన దర్శకుడు సుకుమార్ రూ.100 కోట్లకు పైగా అందుకున్నట్లు సమాచారం. ఇక ఇందులో కథానాయికగా నటించిన రష్మిక మందన్న రూ.10 కోట్లు, ఫహద్ ఫాసిల్ రూ. 8 కోట్లు రెమ్యూనరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఐటెం సాంగ్ చేసిన నటి శ్రీలీల రూ. 2 కోట్లు, సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ రూ. 5 కోట్లకు పైగా పారితోషికం అందుకున్నట్లు సమాచారం.