Sonu Sood : సోనూ సూద్కు బిగ్ షాక్.. పంజాబ్ కోర్టు అరెస్ట్ వారెంట్

బాలీవుడ్ నటుడు సోనూ సూద్కు బిగ్ షాక్ తగిలింది.  మోసం కేసులో ఆయనకు పంజాబ్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సోనూ సూద్ ను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ముంబై పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేసింది.  

New Update
sonu sood

sonu sood

బాలీవుడ్ నటుడు సోనూ సూద్కు బిగ్ షాక్ తగిలింది.  మోసం కేసులో ఆయనకు పంజాబ్ కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సోనూ సూద్ ను అరెస్ట్ చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టాలని ముంబై పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను ఫిబ్రవరి 10వ తేదీకి వాయిదా వేసింది.  మోహిత్ శుక్లా అనే వ్యక్తి రిజికా కాయిన్ లో  పెట్టుబడి పేరుతో  రూ. 10 లక్షల మోసం చేశాడని, దీనికి  నటుడు సోనూ సూద్ ప్రతక్ష్య సాక్షి అంటూ లూధియానాకు చెందిన న్యాయవాది రాజేష్ ఖన్నా  కేసు దాఖలు చేశారు. 

 అనంతరం విచారణ చేపట్టిన కోర్టు సాక్ష్యం చెప్పడానికి సోను సూద్‌ను ఆదేశించింది. అయితే  కోర్టు పంపిన సమన్లకు సోనూ సూద్ స్పందించకపోవడంతో జడ్జి తీవ్రంగా స్పందించారు.  ముంబైలోని అంధేరి వెస్ట్‌లోని ఓషివారా పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ ఆఫీసర్‌ సోనూ సూద్ ను అరెస్టు చేయాలని లూధియానా కోర్టు ఆదేశించింది. లూథియానా జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ రమణ్‌ప్రీత్ కౌర్ ఈ వారెంట్ జారీ చేశారు.  ఈ కేసు ఈ నెల 10న మరోసారి విచారణకు రానుంది.

సోనూ సూద్ దర్శకత్వంలో

తెలుగుతో పాటుగా పలు బాషల్లో నటించిన సినిమాలు చేసిన సోనూ సూద్ తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక కరోనా సమయంలో చాలా మంది పేదవాళ్లను ఆదుకుని మంచి మనసు చాటుకున్నారు.  ఇటీవల  సోనూ సూద్ దర్శకత్వంలో ఫతే అనే యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా 2025 జనవరి 10న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రం కోవిడ్19 మహమ్మారి సమయంలో నిజ జీవిత సైబర్ క్రైమ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు.  ఇందులో జాక్వెలైన్ ఫెర్నాండెజ్, సీరుద్దీన్ షా, విజయ్ రాజ్ కీలక పాత్రల్లో నటించగా..  జీ స్టూడియోస్, శక్తి సాగర్ ప్రొడక్షన్స్ కలిసి సంయుక్తంగా రూపొందించాయి.  

Also Read :   నరకాన్ని దాటుకుంటూ అక్రమంగా అమెరికాకు...డేరియన్‌ గ్యాప్‌ మార్గం అంటే ఏంటి..దీనిని నుంచి వెళ్తే అగ్రరాజ్యాన్ని చేరుకోవచ్చా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు