/rtv/media/media_files/2026/04/03/bandla-2026-04-03-18-11-43.jpg)
టాలీవుడ్ ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో ప్రస్తుతం సందడి నెలకొంది. ఆయన కుమార్తె జనని బండ్ల వివాహం ఖరారు చేశారు. ఈ శుభకార్యానికి సంబంధించిన వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. పెళ్లికి ముందుగా నిర్వహించే ‘పసుపు కుంకుమ’ వేడుకను బండ్ల గణేష్ కుటుంబ సభ్యులు ఎంతో ఉత్సాహంగా నిర్వహించారు. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆయన స్వయంగా సోషల్ మీడియాలో పంచుకున్నారు. "శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు.. దేవుడి ఆశీస్సులు, పెద్దల దీవెనలతో త్వరలో మా ఇంట్లో జరగబోయే శుభకార్యం. చిరంజీవి సూర్యతేజ చిలుకూరి, లక్ష్మీ సౌభాగ్యవతి జనని బండ్లల వివాహ సందర్భంగా పసుపు కుంకుమ కార్యక్రమం నిర్వహించాం" అని ఆయన తన పోస్ట్‌లో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులందరూ కలిసి దిగిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ శుభవార్త తెలిసిన సినీ ప్రముఖులు, అభిమానులు బండ్ల గణేష్ కుటుంబానికి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తున్నారు.
తండ్రి బాధ్యతను నెరవేర్చిన బండ్ల గణేష్ 💥
— TeluguOne (@Theteluguone) April 3, 2026
నా కూతురు నా ప్రాణం.. బండ్ల గణేష్ ఎమోషనల్ 😪😪#bandlaganeshpic.twitter.com/2F55k9623h
నటుడిగా మొదలై నిర్మాతగా..
మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన బండ్ల గణేష్, మొదట నటుడిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత నిర్మాతగా మారి టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని నిర్మించడం ఆయన కెరీర్‌లోనే ఒక మైలురాయిగా నిలిచింది. ఈ చిత్రం ఆయనను టాలీవుడ్‌లో టాప్ ప్రొడ్యూసర్‌గా నిలబెట్టింది.
ఆ తర్వాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలను నిర్మించి బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటారు. ఎన్టీఆర్‌తో ‘బాద్‌షా’, ‘టెంపర్’, రామ్ చరణ్‌తో ‘గోవిందుడు అందరివాడేలే’, అల్లు అర్జున్‌తో ‘ఇద్దరమ్మాయిలతో’ వంటి భారీ చిత్రాలను నిర్మించి నిర్మాతగా సక్సెస్ ఫుల్ కెరీర్‌ను నిర్మించుకున్నారు.
రీఎంట్రీ కోసం సిద్ధం
2015లో వచ్చిన సూపర్ హిట్ చిత్రం ‘టెంపర్’ తర్వాత బండ్ల గణేష్ కొంతకాలం సినీ నిర్మాణానికి బ్రేక్ ప్రకటించారు. అయితే, ఇప్పుడు మళ్లీ ఆయన తన సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమవుతున్నారు. ఈసారి ‘BG Blockbusters’ అనే కొత్త బ్యానర్‌ను ప్రారంభించి, కేవలం కంటెంట్ ఆధారిత సినిమాలతో ప్రేక్షకులను అలరించాలని ప్లాన్ చేస్తున్నారు. వరుసగా వ్యక్తిగత శుభకార్యాలతో పాటు, వృత్తిపరంగా కొత్త బ్యానర్‌తో దూసుకుపోవాలని నిర్ణయించుకున్న బండ్ల గణేష్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Follow Us