/rtv/media/media_files/2026/03/12/rashmika-1-2026-03-12-17-58-31.jpg)
సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై హీరోయిన్ రష్మిక మందన్న ఫైరయ్యారు. ముఖ్యంగా కన్నడలోని మీడియా, ఇన్‌ప్లూయెన్సర్లపై ఆమె తీవ్ర మీడియాలో మండిపడ్డారు. ఈ మేరకు ఆమె వారిని హెచ్చరిస్తూ ఘూటుగా ఓ లేఖ రాశారు.
గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో రష్మిక మందన్న తల్లి సుమన్ మందన్నకు సంబంధించిన ఒక పాత ఆడియో క్లిప్ తెగ వైరల్ అవుతోంది. రష్మిక మాజీ నిశ్చితార్థం, నటుడు రక్షిత్ శెట్టితో ఉన్న పాత గొడవల గురించి ఆ ఆడియోలో ప్రస్తావన ఉంది. అయితే, విజయ్ దేవరకొండతో రష్మిక పెళ్లి జరిగిన కొన్ని వారాలకే ఈ పాత ఆడియో మళ్లీ తెరపైకి రావడంతో హాట్ టాపిక్ గా మారింది. ఇది ఎనిమిదేళ్ల క్రితం ఒక కన్నడ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ అని, కావాలనే ఇప్పుడు దీన్ని వైరల్ చేస్తున్నారని రష్మిక ఆగ్రహం వ్యక్తం చేసింది.
— Rashmika Mandanna (@iamRashmika) March 12, 2026
నిశ్చితార్థం తర్వాత గొడవలు
ఆ ఆడియో క్లిప్‌లో రక్షిత్ శెట్టి కుటుంబంతో జరిగిన విభేదాల గురించి సుమన్ మందన్న మాట్లాడారు. రష్మిక వయసు చిన్నదైనా ఆ సంబంధానికి తాము అంగీకరించామని, కానీ నిశ్చితార్థం తర్వాత గొడవలు మొదలయ్యాయని ఆమె పేర్కొన్నారు. చిన్న చిన్న విషయాలకే రక్షిత్ రచ్చ చేసేవాడని, రష్మిక కెరీర్ విషయంలో కూడా ఆంక్షలు విధించేవారని ఆమె ఆరోపించారు. ముఖ్యంగా గీత గోవిందం సినిమా ఆఫర్ వచ్చినప్పుడు, పెళ్లి తర్వాత నటనకు స్వస్తి చెప్తానని సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలని రక్షిత్ ఒత్తిడి తెచ్చాడని సుమన్ ఆ ఆడియోలో వెల్లడించారు.
రష్మిక తల్లి ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఒకానొక సందర్భంలో రక్షిత్ కుటుంబం తనను క్షమాపణలు చెప్పమని కోరిందని, తప్పు చేయకపోయినా తనను కించపరిచారని పేర్కొన్నారు. రష్మికకు మద్దతుగా నిలవాల్సింది పోయి, రక్షిత్ కూడా వారితో కలిసి గొడవ పడటంతో ఆ బంధం తెగిపోవడమే మంచిదైందని ఆమె ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ఈ పాత విషయాలన్నీ ఇప్పుడు మళ్ళీ బయటకు రావడంతో రష్మిక తీవ్రంగా స్పందించింది.
ఎనిమిదేళ్లుగా తనపై అసత్య ప్రచారాలు
తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న ఈ దాడిని రష్మిక తప్పుబట్టింది. గత ఎనిమిదేళ్లుగా తనపై అసత్య ప్రచారాలు జరుగుతున్నా ఓపిక పట్టానని, కానీ ఇప్పుడు తన కుటుంబాన్ని ఇందులోకి లాగడం సరికాదని ఆమె ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మండిపడింది. తన వ్యక్తిగత జీవితంలో జరుగుతున్న శుభ పరిణామాల సమయంలో కావాలనే ఇలాంటి వివాదాలు సృష్టిస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. 24 గంటల్లోగా ఆ ఆడియో క్లిప్‌లను తొలగించకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, మీడియా సంస్థలపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని రష్మిక గట్టిగా హెచ్చరించింది.
Follow Us