/rtv/media/media_files/2025/02/06/1XqsPs2Hi716tyocdiSq.jpg)
Prabhas Raja Saab Updates
Prabhas Raja Saab Updates: "ఏప్రిల్ 10న "ది రాజా సాబ్" విడుదల అవడం లేదు.. ఇది అందరికి తెలిసిన విషయమే కానీ కొత్తది చెప్పు అంటారా.. ప్రస్తుతం ప్రభాస్ సినిమాల పరిస్థితి చుస్తే అలానే ఉంది, ఒక్కటి అంటే ఒక్క ప్రభాస్ సినిమా కూడా చెప్పిన తేదీకి రిలీజ్ అవడం లేదు. ఇదే పరిస్థితి ఇప్పుడు రాజాసాబ్ విషయం లోను రిపీట్ అయింది, కానీ ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించకపోవడంతో ప్రభాస్ అభిమానులు సమ్మర్ కి రాదని తెలిసినా ఎక్కడో చిన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. త్వరగా "ది రాజా సాబ్" విడుదల తేదీని ప్రకటించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అయితే, ప్రొడక్షన్ హౌస్ "పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ"(Peoples Media Factory) ప్రస్తుతం వివిధ రిలీజ్ డేట్లను సీరియస్‌గా పరిశీలిస్తున్నట్టు సమాచారం.
Also Read: Mastan Sai : డ్రగ్స్ ఇస్తాడు.. న్యూడ్ వీడియోలు తీస్తాడు.. మస్తాన్ మాములోడు కాదయ్యా!
ముఖ్యంగా, పోటీ లేని సోలో రిలీజ్ డేట్ ను సెట్ చేసుకుంటే బాలీవుడ్ మార్కెట్‌ను టార్గెట్ చేయగలమనే ఆలోచనతో సినిమా యూనిట్ ఉన్నారు, దేవర(Devara), పుష్ప 2(Pushpa 2), కల్కి(Kalki) వంటి చిత్రాల లాగ మంచి అనుకూలమైన సోలో విడుదల తేదీలను పరిశీలిస్తున్నారు.
సమ్మర్ రిలీజ్ లేనట్టే..!
వేసవిలో విడుదల చేసే అవకాశాలు తక్కువగా ఉండడంతో, దసరా సమయంలో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది. అయితే, దసరాకి కూడా కొన్ని కష్టాలు ఉన్నాయి. సెప్టెంబర్ 25న బాలకృష్ణ "అఖండ 2"(Akanda 2), సాయి ధరమ్ తేజ్ "సంబరాల ఏటిగట్టు" ఒకే రోజున రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలకు మంచి రిస్పాన్స్ వస్తే, "ది రాజా సాబ్" మంచి థియేటర్లని దక్కించుకోవడం కష్టం అవుతుంది.
Also Read: Sekhar Basha: శేఖర్ బాషాకు బిగ్ షాక్.. మరో కేసు నమోదు..
అక్టోబర్ 2న "కాంతార చాప్టర్ 1"(Kanthara Chapter 1) రిలీజ్ అవుతుంది. ఈ చిత్రానికి ఉన్న భారీ హైప్ వల్ల ఈ విడుదల తేదీని లక్ష్యంగా పెట్టుకొని డైరెక్టర్ రిషబ్ శెట్టి అంత సిద్ధం చేస్తున్నారు.
అయితే, ఈ అడ్డంకులు అన్ని పక్కన పెడితే, "ది రాజా సాబ్" దీపావళి సీజన్ లేదా వేరే సోలో రిలీజ్ డేట్ ని వెతుక్కోక తప్పదు. దీపావళి సీజన్ పెద్దగా వర్కౌట్ అయ్యే సమయం కాదనే వాదన ఉంది, కాబట్టి ఎటువంటి నిర్ణయం తీసుకున్నా, చాలా జాగ్రత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా, నార్త్ మార్కెట్ ప్రభాస్ కు చాలా కీలకమైనది కాబట్టి హిందీ క్లీష్‌ను దృష్టిలో పెట్టుకొని రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాలి.
Also Read: సీఎం రేవంత్ పై తిరగబడ్డ మంత్రి.. ఆ ఎమ్మెల్యేతో కలిసి ఖర్గేతో చర్చలు.. అసలు కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది?
ఆగస్ట్ లో "వార్ 2" (War 2)ఉండటంతో, ఎన్టీఆర్ - హృతిక్(jr ntr- hrithik roshan) ల మల్టీస్టారర్ సినిమా(Multi Starrer Movie)తో "ది రాజా సాబ్" క్లాష్ అంత సేఫ్ కాదు. ఈ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతే "ది రాజా సాబ్" రిలీజ్ తేదీని ప్రకటించే అవకాశం ఉంది. డైరెక్టర్ మారుతి ప్రస్తుతం షూటింగ్ చివరి దశ చిత్రీకరణ జరుపుతున్నట్లు సమాచారం. చూడాలి మరి రాజా సాబ్ ఎప్పుడు వస్తారు అన్నది.