Darling 4K: సినిమా వచ్చి 16 ఏళ్ళైనా అదే క్రేజ్.. థియేటర్లో "డార్లింగ్" ఫ్యాన్స్ సందడి షురూ..!

ప్రభాస్ డార్లింగ్ 16 ఏళ్ల తర్వాత 4Kలో మళ్లీ విడుదలై మంచి స్పందన పొందుతోంది. ప్రభాస్ క్రేజ్‌తో భారీగా టికెట్లు అమ్ముడవుతూ, అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే కోట్ల వసూళ్లు సాధించింది. దీంతో పాత, కొత్త ప్రేక్షకులు థియేటర్లకు వస్తున్నారు.

New Update
Darling 4K

Darling 4K

Darling 4K: కొన్ని సినిమాలు ఎప్పుడు చూసినా బోర్ కొట్టవు. మళ్లీ మళ్లీ చూడాలని అనిపిస్తాయి. అలాంటి సినిమాల్లో ప్రభాస్ డార్లింగ్ ఒకటి. ఈ సినిమా విడుదలై దాదాపు 16 ఏళ్లు అయినా ఇప్పటికీ టీవీలో వస్తే చాలామంది ఆసక్తిగా చూస్తారు. అంత మంచి రిపీట్ వాల్యూ ఈ సినిమాకి ఉంది.

ఈ సినిమాతో ప్రభాస్ కేవలం మాస్ హీరోగానే కాకుండా ప్రతి ఇంట్లో “డార్లింగ్”గా గుర్తింపు పొందాడు. 2010లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో మంచి హిట్ అయింది. ఇప్పుడు అదే సినిమాను 4K క్వాలిటీతో మళ్లీ థియేటర్లలో రిలీజ్ చేస్తున్నారు. దర్శకుడు A. Karunakaran తీసిన ఈ సినిమా మళ్లీ ప్రేక్షకులను థియేటర్లకు తీసుకెళ్తోంది.

రీ-రిలీజ్ అయిన ఈ సినిమాకి భారీ రెస్పాన్స్ వస్తోంది. బుకింగ్స్ ఓపెన్ చేసిన వెంటనే వేల సంఖ్యలో టికెట్లు అమ్ముడయ్యాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు 87 వేల టికెట్లు అమ్ముడయ్యాయి. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఈ సినిమా రూ.2 కోట్లకు పైగా గ్రాస్ సంపాదించడం విశేషం. కొత్త సినిమాల కంటే ఈ క్లాసిక్ సినిమానే చూడాలని ప్రేక్షకులు ముందుకు వస్తున్నారు. UK వంటి దేశాల్లో ఇప్పటికే ప్రీమియర్ షోస్ సందడి మొదలైంది ఫ్యాన్స్ థియేటర్లో ఫుల్ సందడి చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

హైదరాబాద్ ప్రాంతంలో అయితే ఈ సినిమా హవా మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఒక్క హైదరాబాద్‌లోనే కోటి రూపాయలకు పైగా కలెక్షన్స్ రావడం ప్రత్యేకం. మల్టీప్లెక్స్‌లలో చాలా షోలు హౌస్ ఫుల్ అవుతున్నాయి. పాత జ్ఞాపకాలను మళ్లీ చూడాలని పెద్దవాళ్లు, అలాగే కొత్తగా ఈ సినిమా చూడని యువత కూడా థియేటర్లకు వస్తున్నారు.

విదేశాల్లో కూడా ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఉన్న తెలుగు ప్రేక్షకులు కూడా ఈ రీ-రిలీజ్‌ను ఆనందంగా స్వాగతిస్తున్నారు. అక్కడ ఇప్పటివరకు సుమారు 18 వేల డాలర్ల వరకు వసూళ్లు వచ్చాయి. Baahubali తర్వాత ప్రభాస్‌కు వచ్చిన క్రేజ్ ఇంకా కొనసాగుతుందనే విషయం ఈ బుకింగ్స్ చూపిస్తున్నాయి.

ఈ సినిమా సక్సెస్‌లో సంగీత దర్శకుడు G. V. Prakash Kumar పాత్ర కూడా చాలా ముఖ్యమైనది. పాటలు ఇప్పటికీ వినడానికి బాగుంటాయి. అలాగే కాజల్ అగర్వాల్ Kajal Aggarwal, ప్రభాస్ మధ్య ఉన్న కెమిస్ట్రీ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంది. కామెడీ, ఎమోషన్, ఫ్యామిలీ సీన్స్ అన్ని కలిపి ఈ సినిమాను ఎవర్ గ్రీన్ హిట్‌గా నిలబెట్టాయి.

ఇప్పుడు 4K క్వాలిటీతో ఈ సినిమా మరింత అందంగా కనిపించనుంది. మొత్తం మీద ఈ సమ్మర్‌లో “డార్లింగ్” మరోసారి ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది.

Advertisment
తాజా కథనాలు