/rtv/media/media_files/2026/04/20/darling-4k-2026-04-20-15-50-53.jpg)
Darling 4k
Darling 4k: ఇటీవల టాలీవుడ్‌లో రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ బాగా పెరిగింది. పాత హిట్ సినిమాలను కొత్త టెక్నాలజీతో మళ్లీ విడుదల చేస్తూ నిర్మాతలు మంచి లాభాలు పొందుతున్నారు. డ్రై సీజన్‌లో థియేటర్లు కూడా ఈ సినిమాలతో మళ్లీ జనాలతో నిండిపోతున్నాయి. పోకిరి, జల్సా, గబ్బర్ సింగ్, ఖుషి, ఆరెంజ్ వంటి పాత సినిమాలు రీ రిలీజ్‌లో మంచి వసూళ్లు సాధించాయి. ఇటీవల అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన రేసుగుర్రం కూడా మంచి కలెక్షన్స్ తెచ్చింది. ఇప్పుడు ప్రభాస్ నటించిన డార్లింగ్ సినిమా రీ రిలీజ్‌కు సిద్ధమైంది.
ప్రభాస్(Prabhas) కెరీర్‌లో డార్లింగ్ సినిమాకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ సినిమా ముందు ఆయనకు వరుసగా ఫ్లాపులు వచ్చాయి. కానీ డార్లింగ్ ద్వారా ఆయనను లవర్ బాయ్‌గా ప్రేక్షకులు మళ్లీ చూసారు. మంచి కథ, పాటలు, కాజల్ అగర్వాల్ నటన ఈ సినిమాను పెద్ద హిట్‌గా నిలిపాయి. ఇప్పుడు ఈ సినిమాను 4K క్వాలిటీ, డాల్బీ సౌండ్‌తో ఏప్రిల్ 23న ప్రపంచవ్యాప్తంగా మళ్లీ విడుదల చేస్తున్నారు.
ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించగా, కరుణాకరన్ దర్శకత్వం వహించారు. ప్రభాస్, కాజల్ అగర్వాల్ జంటగా నటించగా, ప్రభు, తులసి, శ్రద్ధాదాస్, ఆహుతి ప్రసాద్, ఎంఎస్ నారాయణ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు. 2010లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని సాధించింది.
డార్లింగ్ సినిమా దాదాపు 23 కోట్ల రూపాయలతో నిర్మించారు. విడుదల సమయంలో ఇది మంచి కలెక్షన్స్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లోనే సుమారు 20 కోట్ల రూపాయలు రాబట్టగా, మొత్తం ప్రపంచవ్యాప్తంగా సుమారు 36 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
Darling 4k Bookings
ఇప్పుడు రీ రిలీజ్‌కు కూడా మంచి స్పందన వస్తోంది. ఏప్రిల్ 17 నుంచి అడ్వాన్స్ బుకింగ్ ప్రారంభమైంది. ఇప్పటి వరకు లక్షకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి. భారత్‌లోనే అడ్వాన్స్ బుకింగ్ ద్వారా దాదాపు 1.48 కోట్ల రూపాయలు వచ్చాయి.
విదేశాల్లో కూడా ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ ఉంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో టికెట్లు వేగంగా అమ్ముడవుతున్నాయి. అక్కడ స్పెషల్ షోల ద్వారా మంచి కలెక్షన్స్ వస్తున్నాయి. మొత్తం మీద ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా అడ్వాన్స్ బుకింగ్ ద్వారా దాదాపు 1.60 కోట్ల రూపాయలు వచ్చాయి.
ఇంకా రిలీజ్‌కు రెండు రోజులు సమయం ఉండటంతో, ఈ కలెక్షన్స్ మరింత పెరుగుతాయని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
Follow Us