Baahubali 2 Records: సంచలనానికి 9 ఏళ్ల! ‘బాహుబలి 2’ సృష్టించిన చరిత్ర ఇదే!!

బాహుబలి 2: ది కన్‌క్లూజన్ విడుదలై 9 ఏళ్లు పూర్తయ్యాయి. S. S. రాజమౌళి తెరకెక్కించిన ఈ సినిమా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, పాన్ ఇండియా ట్రెండ్‌కు దారితీసింది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చూపించింది.

New Update
Baahubali 2 Records

Baahubali 2 Records

Baahubali 2 Records: ఒక్క సినిమా... వేల రికార్డులు! ఇండియన్ సినిమాను షేక్ చేసిన చిత్రం బాహుబలి 2: ది కన్‌క్లూజన్ Baahubali 2: The Conclusion విడుదలై 9 ఏళ్లు పూర్తయ్యాయి. S. S. రాజమౌళి S. S. Rajamouli తెరకెక్కించిన ఈ సినిమా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, పాన్ ఇండియా ట్రెండ్‌కు దారితీసింది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చూపించింది.

9 Years For Baahubali 2

భారతీయ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించిన Baahubali 2: The Conclusion విడుదలై నేటికి 9 సంవత్సరాలు పూర్తయ్యాయి. 2017 ఏప్రిల్ 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లోనే భారీ సంచలనాన్ని సృష్టించింది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చూపించిన చిత్రంగా ఇది గుర్తింపు పొందింది.

Also Read: ‘ధురంధర్’ కాంబో రిపీట్.. ఆదిత్య ధర్ ప్లాన్ మామూలుగా లేదుగా!

ఈ సినిమాకు S. S. రాజమౌళి S. S. Rajamouli దర్శకత్వం వహించగా, ప్రభాస్ Prabhas హీరోగా నటించారు. విలన్ గా రానా దగ్గుబాటి Rana Daggubati ఆకట్టుకున్నారు. అలాగే అనుష్క శెట్టి Anushka Shetty, తమన్నా భాటియా Tamannaah Bhatia హీరోయిన్లుగా నటించారు.

‘బాహుబలి 2’ విడుదలైన వెంటనే బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా దాదాపు రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఆ సమయంలో రూ.1000 కోట్ల మార్క్ దాటిన తొలి భారతీయ సినిమాగా ఇది చరిత్ర సృష్టించింది.

Also Read: రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు స్టేజిపై ఏడ్చేసిన హీరోయిన్.. అసలేమైందంటే?

ముఖ్యంగా హిందీ మార్కెట్‌లో కూడా ఈ సినిమా అద్భుతమైన రెస్పాన్స్ పొందింది. కేవలం హిందీ వెర్షన్ ద్వారానే రూ.500 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు సాధించి, బాలీవుడ్‌లో ఉన్న పెద్ద హీరోల రికార్డులను దాటింది.

ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా భారీగా బిజినెస్ జరిగింది. దాదాపు రూ.350 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగిన ఈ చిత్రం, ఫుల్ రన్ ముగిసే సరికి సుమారు రూ.814 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది. గ్రాస్ పరంగా రూ.1750 కోట్లకు పైగా రాబట్టి అప్పటి వరకు ఎవరూ చేరని స్థాయిని అందుకుంది. ఈ సినిమాతో బయ్యర్లకు కూడా భారీ లాభాలు వచ్చాయి.

Also Read: "డార్లింగ్ 4K" రీ-రిలీజ్ విధ్వంసం! ఆ రికార్డులన్నీ లేపేసిన ప్రభాస్!

‘బాహుబలి 2’ విజయం తర్వాత భారతీయ సినిమాలో ‘పాన్ ఇండియా’ అనే భావన బలంగా స్థిరపడింది. వివిధ భాషల్లో సినిమాలు విడుదల చేసి దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని ఈ సినిమా చూపించింది. ప్రస్తుతం మనం చూస్తున్న పెద్ద సినిమాల ట్రెండ్‌కు ఈ చిత్రం మార్గం చూపిందని చెప్పాలి.

ఈ సినిమా విడుదలై 9 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చిత్రబృందం సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టర్ విడుదల చేసి ఆనందాన్ని పంచుకుంది. ఈ సందర్భంగా అభిమానులు కూడా ఈ సినిమాను గుర్తు చేసుకుంటూ పోస్టులు పెడుతున్నారు.

Also Read: కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!

మొత్తానికి ‘బాహుబలి 2’ కేవలం ఒక సినిమా మాత్రమే కాదు, భారతీయ సినిమా దిశను మార్చిన ఒక పెద్ద మైలురాయిగా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటూనే ఉన్నారు అంటే, అది సాధించిన విజయమే కారణం.

Advertisment
తాజా కథనాలు