/rtv/media/media_files/2026/05/30/peddi-2026-05-30-07-19-35.jpg)
Peddi
మెగా పవర్ స్టార్ రాంచరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కాంబినేషన్‌లో వస్తున్న పెద్ది సినిమా కోసం టాలీవుడ్ ఆడియన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ పాన్ ఇండియా సినిమా విడుదలకు అంతా సిద్ధమైంది. సినిమా ప్రమోషన్స్ కూడా దేశంలోని ప్రధాన నగరాల్లో గ్రాండ్‌గా పూర్తి చేశారు. జూన్ 4న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ అవుతుండగా.. జూన్ 3వ తేదీ రాత్రి నుండే స్పెషల్ ప్రీమియర్ షోలు పడబోతున్నాయి.
ఏపీలో ఈ సినిమా స్పెషల్ షోలకు, టికెట్ల రేట్లు పెంచుకోవడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో సోమవారం మధ్యాహ్నం నుండే ఏపీలోని పలు నగరాల్లో బుకింగ్స్ జోరుగా ఓపెన్ అయ్యాయి. కొన్ని థియేటర్లలో జూన్ 5 నాటి మార్నింగ్ షో టికెట్లను కూడా అప్పుడే అందుబాటులోకి తెచ్చారు. ఈ స్పెషల్ షో టికెట్ ధర రూ. 600 (జీఎస్‌టీతో కలిపి) గా నిర్ణయించారు. జూన్ 4 నుండి పది రోజుల వరకు మామూలు టికెట్ ధరలపై.. సింగిల్ స్క్రీన్స్ లో రూ. 100, మల్టీప్లెక్స్‌లలో రూ. 125 చొప్పున పెంచుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. రోజుకు 5 షోలు ప్రదర్శించుకోవచ్చు.
తెలంగాణలో సందిగ్ధత
మరోవైపు తెలంగాణలో టికెట్ల రేట్ల పెంపుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. ఇక్కడ హైకోర్టు రూల్స్ ఉండటంతో చిత్ర యూనిట్ ఆచితూచి అడుగులు వేస్తోంది. ఈ రోజు లేదా రేపటికల్లా తెలంగాణ రేట్లపై ఒక క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఒకవేళ గవర్నమెంట్ నుండి రేట్ల పెంపుకు పర్మిషన్ రాకపోతే.. నార్మల్ రేట్లతోనే థియేటర్లలోకి వెళ్లడం మినహా చరణ్ టీమ్‌కు మరో ఆప్షన్ లేదు. ఇటీవల వచ్చిన ధురంధర్ 2 సినిమా కూడా రేట్లు పెంచకుండా నార్మల్ ప్రైస్‌తోనే వచ్చి సూపర్ హిట్ కొట్టింది. పెద్ది కూడా అదే ఫార్ములా ఫాలో అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. చరణ్ మాస్ లుక్ ఈ సినిమాలో ఎలా ఉండబోతుందో చూడాలని థియేటర్ల దగ్గర మెగా ఫ్యాన్స్ అప్పుడే రచ్చ మొదలుపెట్టారు.
కాగా మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ , వృద్ధి సినిమాస్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై ట్రేడ్ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా పూర్తిగా ఉత్తరాంధ్ర తీర ప్రాంతం నేపథ్యంలో సాగే ఒక పవర్‌ఫుల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించారు. చిత్రానికి రెహమాన్ సంగీతం అందించారు. కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్‌కుమార్ ఈ సినిమాలో ఒక అత్యంత కీలకమైన, పవర్‌ఫుల్ పాత్రను పోషించారు.
Follow Us