/rtv/media/media_files/HAidTgrerk9hXre2v5lq.jpg)
Hari hara veera mallu
Hari Hara Veera Mallu: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ వైపు రాజకీయాలతో బిజీగా ఉంటూనే మరోవైపు సమయం దొరికినప్పుడల్లా సినిమా షూటింగ్ లలో పాల్గొంటున్నారు. ప్రస్తుతం ఆయన మూడు సినిమాలు పూర్తిచేయాల్సి ఉంది. అందులో ఒకటి జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'హరి హర వీరమల్లు'. దాదాపు రెండేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా పవన్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో ఆలస్యమవుతూ వస్తోంది. ఎట్టకేలకు రీసెంట్ గా మేకర్స్ మార్చి 28న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.
Also Read: chhaava: అదిరిపోయింది గురూ.. చావా సినిమా చూడటానికి ఏకంగా గుర్రంపై వచ్చి.. వీడియో వైరల్
మళ్ళీ పోస్ట్ ఫోన్?
ఇది ఇలా ఉంటే మరోసారి 'హరిహర వీరమల్లు' వాయిదా పడినట్లు కొద్దిరోజులుగా మీడియాలో వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. షూటింగ్ పూర్తికాకపోవడంతో అనుకున్న డేట్ కంటే ఆలస్యంగా రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా నిర్మాత ఏఎం రత్నం దీనిపై స్పందించారు.
Also Read: BIG BREAKING: మోనాలిసాకు బిగ్ షాక్.. మోసం చేసిన డైరెక్టర్?
'హరిహర వీరమల్లు' చిత్రాన్ని ఎట్టకేలకు అనుకున్న తేదీకే విడుదల చేస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన మెజారిటీ వర్క్ పూర్తయిందని.. మిగిలిన వర్క్ కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి రిలీజ్ డేట్ కే విడుదల చేస్తామని తెలిపారు. రెండు భాగాలుగా రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రాన్ని మెగా సూర్య ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. ఇందులో నిధి అగర్వాల్ కథానాయికగా నటించగా.. అనుపమ్‌ఖేర్, బాబీ దేవోల్, విక్రమ్ జీత్, జిషుసేన్ గుప్త తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి పవన్ పాడిన 'మాట వినాలి' సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అయ్యింది. పవన్ గొంతుతో సాగిన ఈ పాట ఫ్యాన్స్ లో ఫుల్ జోష్ నింపింది.
Also Read: Rishab Shetty: ఫ్యాన్స్ కి గూస్ బంప్స్.. ఛత్రపతి శివాజీ మహారాజ్ గా రిషబ్ శెట్టి.. పోస్టర్ వైరల్