Pawan Kalyan: ఇకపై సినిమాలు చేయరా? పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు

పవన్ కళ్యాణ్ సినిమా రంగంలో కొనసాగుతారా? లేదా అనే సందేహం చాలా మంది అభిమానుల్లో ఉంది. ఈ క్రమంలో పవన్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. తాను ఎలాంటి సంపద కూడబెట్టలేదని, తనకు ఉన్న ఆదాయమార్గం నటనే అని క్లారిటీ ఇచ్చారు. డబ్బు అవసరమున్నంత వరకు నటిస్తూనే ఉంటానని తెలిపారు.

New Update

Pawan Kalyan: ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మూడు సినిమాలతో బిజీగా ఉన్నారు. జ్యోతి కృష్ణ దర్శకత్వంలో 'హరిహరవీరమల్లు', హరీష్ శంకర్ తో 'ఉస్తాద్ భగత్ సింగ్', సుజిత్ కాంబోలో 'ఓజీ'.  ఏపీ డిప్యూటీ సీఎంగా ఓ వైపు జకీయాలతో బిజీగా ఉంటూనే.. మరోవైపు సమయం దొరికినప్పుడల్లా షూటింగ్ షెడ్యూల్ లో పాల్గొంటున్నారు. వీలైనంత త్వరగా మూడు సినిమాలను పూర్తి చేసేపనిలో ఉన్నారు. అయితే ఈ సినిమాల తర్వాత పవన్ సినిమా రంగంలో కొనసాగుతారా? లేదా సినిమాలకు స్వస్తి చెప్పి తన పూర్తి సమయాన్ని ప్రజాసేవకు కేటాయిస్తారా? అనే సందేహం చాలా మంది అభిమానుల్లో ఉంది. ఈ క్రమంలో తాజాగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. 

Also Read: SIKANDAR Trailer: వైలెన్స్, లవ్, యాక్షన్, డ్రామా.. సల్మాన్ ఖాన్ 'సికందర్' ట్రైలర్ భలే ఉంది!

ఇకపై సినిమాలు చేయరా..? 

ఇటీవలే పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో సినిమాల గురించి మాట్లాడుతూ.. డబ్బు అవసరం ఉన్నంతవరకు నటిస్తూనే ఉంటానని అన్నారు. ''నేను నిస్వార్థంగా సేవ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చాను. ఎప్పుడు అదే ఆలోచనలు ఉంటాను. నేను ఎలాంటి సంపద కూడబెట్టలేదు, వ్యాపారాలు కూడా లేవు. నాకు ఉన్న ఒకే ఆదాయమార్గం నటనే. సినిమాలు  చేస్తున్నంతవరకు వాటికి న్యాయం చేయాలి. అలాగే నాకు డబ్బు అవసరమున్నంత వరకు నటిస్తూనే ఉంటాను. అదేవిధంగా పరిపాలనకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటాను'' అని క్లారిటీ ఇచ్చారు పవన్. 

cinema-news | pawan-kalyan | latest-news

ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్

Advertisment
Advertisment
Advertisment