/rtv/media/media_files/2026/06/03/ram-charan-pawan-2026-06-03-15-45-11.jpg)
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న సమయం వచ్చేసింది. మరికొన్ని గంటల్లోనే పెద్ది సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే ప్రీమియర్ షోలకు అంతా సిద్ధమైంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని సెలబ్రిటీలు అందరూ ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.
తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పెద్ది’ టీమ్‌కు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. తన సొంత నిర్మాణ సంస్థ పవన్ కల్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సోషల్ మీడియా ఖాతాలో ఇందుకోసం ఒక వీడియోను షేర్ చేశారు. కొండగట్టు ఆంజనేయ స్వామి ఆశీస్సులతో ఈ సినిమా అన్ని ఆటంకాలను దాటుకుని ఘన విజయం సాధించాలని పవన్ ఆకాంక్షించారు. ఈ వీడియోలో చిన్నప్పుడు రామ్ చరణ్‌ను పవన్ కల్యాణ్ ఆశీర్వదిస్తున్న ఒక బ్యూటిఫుల్ ఫోటో కూడా ఉంది.
బాబాయ్ పంపిన వీడియోపై రామ్ చరణ్ స్పందిస్తూ.. "మీ మాటలు నాకు, మా పెద్ది టీమ్‌కు ఎంతో ఎనర్జీని ఇచ్చాయి. మాపై మీకున్న ప్రేమకు, సపోర్ట్‌కు చాలా థాంక్స్ బాబాయ్" అంటూ రీపోస్ట్ చేశారు. మరోవైపు పవన్ కల్యాణ్ భార్య అన్నా కొణిదెల కూడా పెద్ది సినిమా సూపర్ హిట్ అవ్వాలని సోషల్ మీడియా ద్వారా విషెస్ చెప్పారు.
సీన్లు చాలా హైలైట్
ఈ సినిమాలో ఢిల్లీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే సీన్లు చాలా హైలైట్‌గా ఉంటాయని మొదటి నుంచి టాక్ నడుస్తోంది. దీనిపై తాజాగా కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కూడా స్పందించారు. ఢిల్లీ ఎపిసోడ్ మొత్తం మాస్ యాక్షన్ సీన్లతో, ఎమోషన్స్‌తో నిండిపోతుందని.. డైరెక్టర్ బుచ్చిబాబు ఈ సీన్లను చాలా అద్భుతంగా తీశారని ఆయన చెప్పారు. షూటింగ్ సమయంలో రామ్ చరణ్‌తో కలిసి దిగిన ఫోటోలను షేర్ చేస్తూ.. ఈ సినిమాలో భాగం కావడం చాలా సంతోషంగా ఉందని జానీ మాస్టర్ పోస్ట్ చేశారు.
Follow Us