WAR 2: వార్ 2 రిలీజ్ డేట్ కన్ఫర్మ్.. తారక్ ఫ్యాన్స్ కి పండగే!

వార్2 రిలీజ్ వాయిదా అంటూ వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు మేకర్స్. తాజాగా మూవీ గురించి ఓ నెటిజన్ పెట్టిన పోస్టుకు స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఈ ఏడాది ఆగస్ట్ 14న వార్2 థియేటర్లలో అల్లకల్లోలం సృష్టిస్తుంది అని ట్వీట్ చేశారు.

New Update
War2: ఫ్యాన్స్‌కి పూనకాలు తెప్పిస్తోన్న జూనియర్‌ ఎన్టీఆర్‌.. హృతిక్ రోషన్‌తో కాంబోపై అదిరే అప్‌డేట్!

WAR 2: హృతిక్ రోషన్- జూనియర్ ఎన్టీఆర్ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్  స్పై థ్రిల్లర్ వార్2. ఈ చిత్రం  ఆగస్టు 14న విడుదల కానున్నట్లు  ఇప్పటికే మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ఇటీవలే హీరో హృతిక్ రోషన్ కి గాయాలు కావడంతో షూటింగ్ కి బ్రేక్ పడిందని, రిలీజ్ అనుకున్న సమయానికి  కాదేమోనని అనుమానాలు వ్యక్తమయ్యాయి. దీంతో తారక్ ఫ్యాన్స్  నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో తాజాగా మేకర్స్ అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. ఒక్క పోస్టుతో రిలీజ్ వాయిదా అంటూ వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టారు. 

వార్2 గురించి ఓ నెటిజన్ పెట్టిన పోస్టుకు స్పందిస్తూ.. మేము 'వార్2' ప్రారంభించక ముందే మీరు  అద్భుతంగా సెట్ చేశారు.  ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది ఆగస్టు 14న థియేటర్లలో  'వార్2'  అల్లకల్లోలం సృష్టిస్తుంది అంటూ నెటిజన్ పోస్టుకు రిప్లై ఇచ్చారు. దీంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. తెరపై ఎన్టీఆర్- హృతిక్ మాస్ యాక్షన్ చూసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తారక్ ఈ సినిమాతో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. 

యష్ రాజ్ ఫిల్మ్ బ్యానర్ పై అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉంది.  గతకొద్దిరోజులుగా ముంబై లో ఎన్టీఆర్- హృతిక్ పై భారీ పాటను చిత్రీకరిస్తున్నారు. దాదాపు 500 మందికి పైగా డాన్సర్లు ఇందులో పాల్గొంటున్నారు. కాగా, ఈ పాట చిత్రీకరణ సమయంలో హీరో  హీరో హృతిక్ రోషన్ గాయపడినట్లు తెలిసింది. 2019లో విడుదలైన వార్ సీక్వెల్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కియారా అద్వానీ కథానాయికగా నటిస్తోంది. 

ఇది ఇలా ఉంటే ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస లైన్ అప్ సినిమాలతో బిజీగా ఉన్నారు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో #NTRNeel, మరోవైపు దేవర పార్ట్ 2 చిత్రీకరణలో పాల్గొంటున్నారు. ఇటీవలే #NTRNeel షూటింగ్ మొదలైనట్లు అధికారికంగా ప్రకటించారు. 

Also Read: Suma Chaaaat Show: తమన్ చాట్ ఛాలెంజ్.. సుమ కంటెస్ట్ లో విన్ అవ్వడానికి ఇలా చేయండి?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు