'దేవర' ఊచకోత.. మూడో రోజు కలెక్షన్లు ఎంతంటే..!

ఎన్టీఆర్ 'దేవర' రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 243 కోట్ల వసూళ్ళు చేసింది. మూడో రోజు ఈ చిత్రం దేశవ్యాప్తంగా రూ. 40 కోట్ల వసూళ్లు సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

New Update

Devara Day 3 Collections : కొరటాల శివ దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్, సైఫ్ అలీఖాన్ ప్రధాన పాత్రలో భారీ అంచనాలతో విడుదలైన చిత్రం  'దేవర'.  అద్భుతమైన ఓపెనింగ్స్ మొదలైన ఈ మూవీ.. తెలుగు మార్కెట్‌లో ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన ఓపెనర్ గా నిలిచింది. రెండు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ. 243 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్ తెలిపారు. దేశవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్స్ చూస్తే.. మొదటి రోజు ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి దేశవ్యాప్తంగా రూ.  82.5 కోట్లు చేయగా.. రెండవ రోజు  రూ. 38.2 కోట్లు చేసినట్లు సక్‌నిల్క్ తెలిపింది.  

ఇక దేవర మూడవ కలెక్షన్స్ విషయానికి వస్తే.. 

సక్‌నిల్క్ నివేదిక ప్రకారం.. రెండవ రోజుతో పోలిస్తే  మూడవ రోజు  'దేవర' కలెక్షన్స్ కాస్త పెరిగాయి. మూడవ రోజు  దేశవ్యాప్తంగా  రూ.40.3 కోట్లు వసూలు చేసింది. తెలుగు మార్కెట్ నుంచి రూ. 27.65 కోట్లు, హిందీలో రూ. 11 కోట్లు వచ్చాయి. కన్నడ రూ. 0.35 కోట్లు, తమిళం, మలయాళం  వెర్షన్స్ లో రూ.1.05 కోట్లు, రూ.0.25 కోట్లు రాబట్టింది. మొదటి మూడు రోజుల్లో  'దేవర' దేశవ్యాప్తంగా రూ.161 కోట్లకు చేరుకున్నట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ విలన్ గా పవర్ ఫుల్ రోల్ లో పోషించారు. జాన్వీ కపూర్ ఫిమేల్ లీడ్ గా నటించింది. శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, శ్రుతి మరాఠే, షైన్ టామ్ చాకో, నారాయణ్, కలైయరసన్, మురళీ శర్మ, అజయ్, అభిమన్యు సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. అనిరుధ్ రవిచంద్రన్ మ్యూజిక్ ఈ సినిమాకు మరింత హైలైట్ గా నిలిచింది. 

Also Read:  కంగనా కొత్త కారు ధర తెలిస్తే మైండ్ బ్లాకే.. ఏకంగా బంగ్లాను అమ్మేసి కొనుగోలు చేసిందిగా..!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Shine Tom Chacko షైన్ పై మరో నటి సంచలనం.. సెట్ లో లైంగికంగా..

నటుడు షైన్ టామ్ చాకో పై మరో నటి సంచలన ఆరోపణలు చేసింది. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న అపర్ణ అక్కడి మీడియాతో మాటాడుతూ.. షూటింగ్ సమయంలో షైన్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని తెలిపింది. లైంగికంగా ప్రేరేపించే విధంగా ఆయన మాటలు ఉండేవని ఆరోపించింది.

New Update
actress Aparna allegations on Shine Tom Chacko

actress Aparna allegations on Shine Tom Chacko

Shine Tom Chacko మలయాళ నటి విన్సీ తర్వాత మరి నటి  షైన్ టామ్ చాకో పై ఆరోపణలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. 'సూత్రవ్యాక్యం' సినిమా షూటింగ్ సమయంలో షైన్ తనతో అనుచితంగా ప్రవర్తించాడని నటి అపర్ణ జోన్స్  మీడియా ముందుకు వచ్చారు. ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉంటున్న ఆమె.. అక్కడి మీడియాతో మాట్లాడుతూ షైన్ పై సంచలన ఆరోపణలు చేసింది. షైన్ తనతో చాలా చెడుగా ప్రవర్తించేవాడని, లైంగికంగా ప్రేరేపించే విధంగా మాట్లాడేవాడిని ఆరోపించింది. దీని గురించి అక్కడ సిబ్బందితో కూడా చెప్పానని  పేర్కొంది. 

100 శాతం నిజాలు.. నటి అపర్ణ 

నటి అపర్ణ జోనస్ ఇంకా మాట్లాడుతూ.. అతడి గురించి విన్సీ పంచుకున్న అనుభవాలు 100 శాతం నిజాలు. సెట్లో నేను అతడితో కూర్చొని ఉన్నప్పుడు షైన్ నోట్లో ఏదో తెల్లటి పదార్థం ఉమ్మేసేవాడు. ఆధారాలు లేకుండా నేను దానిని డ్రగ్స్ అని చెప్పలేను.. అది గ్లూకోజ్ కూడా అయి ఉండొచ్చు. కానీ అతడి ప్రవర్తన గురించి మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. సెట్ లో ఎప్పుడూ తిరుగుతూ ఉండేవాడు.. అనవసరమైన మాటలు మాట్లాడేవారు. పరిసరాల్లో అమ్మాయిలు ఉంటే తన మాటలు మరింత అసభ్యకరంగా ఉండేవి. తన ప్రవర్తన నాకు చాలా అసౌకర్యాన్ని కలిగించింది. వెంటనే అక్కడి సిబ్బందితో నా అసౌకర్యం గురించి చెప్పాను. దీంతో చిత్రబృందం అతడి కంటే ముందు నా షెడ్యూల్ పూర్తి చేసి పంపించారు. 

ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉండడం వల్ల చట్టపరమైన చర్యల్లో పాల్గొనలేకపోతున్నాను. అక్కడ ఉంటే ఖచ్చితంగా ఈ సమస్యను ముందుకు తీసుకెళ్లేదానిని అని తెలిపింది నటి అపర్ణ జోన్స్

latest-news | cinema-news | actor-shine-tom-chacko

Advertisment
Advertisment
Advertisment