/rtv/media/media_files/2025/03/26/LUctDkfVu77czQkt033r.jpg)
ntr birth day wishes to wife pranathi
NTR: జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం జపాన్ లో 'దేవర' ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. ఓ పక్క ప్రమోషన్స్ చేస్తూనే.. మరోవైపు ఫ్యామిలీ లైఫ్ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. మార్చి 26న భార్య లక్ష్మీ ప్రణతీ పుట్టినరోజును జపాన్ లో సెలెబ్రేట్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను తారక్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. 'అమ్మలు హ్యాపీ బర్త్ డే' అంటూ భార్యకు బ్యూటిఫుల్ విషెష్ తెలియజేశారు. ఈ ఫొటోలు షేర్ చేసిన క్షణాల్లో వైరల్ గా మారాయి. తారక్, ప్రణతి జంటపై అభిమానులు లైకులు వర్షం కురిపిస్తున్నారు. వీరిద్దరికీ అభయ్, భార్గవ్ రామ్ ఇద్దరు కుమారులు ఉన్నారు.
మార్చి 28న విడుదల..
ఇదిలా ఉంటే.. జపాన్ లో మార్చి 28న 'దేవర' చిత్రం విడుదల కానుంది. ఇప్పటికే అక్కడ ప్రైవేట్ ప్రివ్యూ షోలను ప్రదర్శించగా మంచి రెస్పాన్స్ వచ్చింది. 'RRR' సక్సెస్ తర్వాత జపాన్ లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ బేస్ బాగా పెరిగింది. మరోవైపు ఎన్టీఆర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న 'వార్ 2' షూటింగ్ లోనూ పాల్గొంటున్నారు. YRF యూనివర్స్ లో రూపొందుతున్న ఈ సినిమాతో తారక్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇందులో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్నారు. దీంతో పాటు ప్రశాంత్ నీల్ కాంబోలో # 'NTRNeel' సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈమూవీ షూటింగ్ మొదలవగా.. పలు యాక్షన్ సీక్వెన్స్ లో చిత్రీకరిస్తున్నారు.
ఇది కూడా చూడండి: SSMB 29 Updates: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
cinema-news
ఇది కూడా చూడండి: Contaminated Food: ప్రాణాలు తీస్తున్న కలుషిత ఆహారం.. అందుకే వండిన వెంటనే తినేయాలి