Nithin : వేణు ఎల్లమ్మ మూవీకి గ్రీన్ సిగ్నల్.. ఆ కుర్ర హీరో ఎవరంటే?

బలగంతో దర్శకుడిగా మారిన వేణు తన తర్వాత సినిమా ఎల్లమ్మలో హీరోగా నితిన్‌ కన్ఫార్మ్ అయినట్లు తెలుస్తోంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రం షుటింగ్ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమై.. అదే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

New Update
Venu

వేణు దర్శకత్వంలో వచ్చిన బలగం సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. తెలంగాణ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాకు ప్రేక్షకులు బాగా దగ్గరయ్యారు. అయితే ఈ సినిమా హిట్ తర్వాత వేణు బిజీగా ఉన్నాడు. అయితే ఎప్పటి నుంచో ఎల్లమ్మ సినిమాను చేయాలనే హీరోలందిరికీ కథ చెప్పుకుంటూ తిరుగుతున్నాడు. మొదట ఈ ఎల్లమ్మ కథను హీరో నానికి వినిపించాడు. అయితే స్టోరీకి నచ్చక అతను ఈ సినిమా ఆసక్తి చూపలేదు.

ఇది కూడా చదవండి: తెలంగాణలో కొత్త టీచర్ల చేరిక నేడే

యంగ్ హీరో నితిన్ గ్రీన్ సిగ్నల్..

ఎన్నిసార్లు కథలో మార్పులు చేసిన కూడా నచ్చకపోవడంతో నాని నో చెప్పాడు. ఆ తర్వాత శర్వానంద్‌కి చెప్పగా.. అతను కూడా తిరస్కరించారట. హనుమాన్ హీరో తేజ సజ్జాని సంప్రదించిన కూడా ఇతర సినిమాలకి సైన్ చేయడం వల్ల ఇప్పట్లో చేయలేనని తెలిపారు. ఇదిలా ఉండగా.. ఈ సినిమాకి హీరో నితిన్ ఒకే చెప్పినట్లు వార్తలు చక్కర్లు కొడుతోంది. నాని, శర్వానంద్‌, తేజకి కథ చెప్పిన తర్వాత నో చెప్పడంతో.. ఎల్లమ్మ కథను యంగ్‌ హీరో నితిన్‌కి చెప్పాడు. 

ఇది కూడా చదవండి: చెన్నైలో భారీ వర్షాలు.. వరదల్లో చిక్కుకున్న రజినీకాంత్!

నితిన్ కథ మొత్తం విన్న తర్వాత ఒకే చెప్పాడని తెలుస్తోంది. ప్రస్తుతం నితిన్‌ హీరోగా రాబిన్‌హుడ్‌‌తో పాటు మరో సినిమాలో కూడా చేస్తున్నారు. ఈ సినిమాలు అయిన తర్వాత లేదా మధ్యలో సమయం ఉంటే షుటింగ్ మొదలవ్వున్నట్లు తెలుస్తోంది. బలగం ఎలా డిఫరెంట్‌గా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందో.. ఎల్లమ్మ కూడా అలాగే ఉంటుందని తెలుస్తోంది. ఈ సినిమాను దిల్‌రాజు నిర్మించనున్నాడు. మరి దీనిపై వేణు స్పందిస్తేనే క్లారిటీ రానుంది. 

ఇది కూడా చదవండి: America-Ap: అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం..ఏపీకి చెందిన ముగ్గురి మృతి!

ఇటీవల ఓ సినిమా వేడుకలో ఎల్లమ్మ సినిమా షుటింగ్ ఎప్పుడు మొదలు పెడతావని వేణుని దిల్‌రాజు అడిగాడు. దీంతో అతను మీరు ఎప్పుడు అంటే అప్పుడే మొదలు పెడతానని అన్నాడు. దీంతో దిల్‌రాజు వద్దులే ఫిబ్రవరి నుంచి మొదలు పెట్టమన్నట్లు సమాధానం ఇచ్చారు. అయితే వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి ఎల్లమ్మ షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు సమాచారం. వచ్చే ఏడాది చివరన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. లేద షూటింగ్‌ ఆలస్యం అయితే 2026 సంక్రాంతికి విడుదల అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. 

ఇది కూడా చదవండి: Hyundai ఐపీఓ ప్రారంభం.. ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే?

Advertisment
Advertisment
తాజా కథనాలు