/rtv/media/media_files/2025/02/14/oy2GsYoBXtdtA3msUzAG.jpg)
Robinhood Wherever You Go Lyrical Video song released
యంగ్ హీరో నితిన్ ఒక మంచి బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇందులో భాగంగానే వరుస సినిమాలు చేస్తున్నాడు. కానీ అతడు ఆశించినంత హిట్లు మాత్రం పడటం లేదు. అయితే ఈ సారి ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ ఉన్న స్టోరీలనే ఎంచుకుంటున్నాడు. ఈ క్రమంలోనే దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్‌లో ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ఆ చిత్రమే ‘రాబిన్ హుడ్’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఫుల్ యాక్షన్ అండ్ కామెడీ జోనర్లో ఇది రాబోతుంది. ఇందులో నితిన్ సరసన శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ అంచనాలను పెంచేశాయి.
Also Read: Fastag: ఫాస్టాగ్ యూజర్లకు అలర్ట్..ఫిబ్రవరి 17 నుంచి కొత్త రూల్స్!
సెకండ్ సింగిల్ రిలీజ్
ఈ క్రమంలో మేకర్స్ మరో సర్‌ప్రైజ్ అందించారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఇవాళ ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ అందించారు. తాజాగా ఈ మూవీలోని ‘వేరెవర్ యూ గో’ అంటూ సాగే సాంగ్ లిరికల్ వీడియోను మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. ఇందులో నితిన్ క్లాసిక్ స్టెప్పులకు సినీ ప్రియులు ఫిదా అయిపోతున్నారు. ప్రస్తుతం ఈ సాంగ్ ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు ఈ సాంగ్‌పై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. సాంగ్‌లో మొత్తం పలు బ్రాండ్‌లు చూపించడంతో ఆశ్చర్యపోతున్నారు. ఇది సినిమా సాంగ్ ఆ.. లేక యాడ్స్ సాంగ్ ఆ అంటూ గుసగుసలాడుకుంటున్నారు.
Also Read:Trump: ముంబయి దాడుల సూత్రధారి అప్పగింతకు ట్రంప్ అంగీకారం!
Celebrate Valentine's Day in a BRAND new style with a BRAND new melody 💕#Robinhood second single #WhereverYouGo out now 💓
— Mythri Movie Makers (@MythriOfficial) February 14, 2025
▶️ https://t.co/qvxtyLtqRc
A @gvprakash musical
Sung by @ArmaanMalik22
Lyrics by @kk_lyricist
Choreography by #Moin Master
IN CINEMAS WORLDWIDE ON… pic.twitter.com/g3nSk8TdyN
భారీ అంచనాలున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ చిత్రాన్ని మార్చి 28న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇది వరకే తెలిపారు. మరి ఈ సినిమా ఏమైనా నితిన్ కెరీర్‌ను మార్చుతుందో లేదో చూడాలి.