Niharika: 'మ్యాడ్' బాయ్ తో మెగా డాటర్.. నిహారిక కొత్త మూవీ పోస్టర్ వైరల్!

నిహారిక తన సొంత బ్యానర్ లో మరో ఫీచర్ ఫిల్మ్ అనౌన్స్ చేసింది. ఇందులో 'మ్యాడ్' సంగీత్ శోభన్ హీరోగా నటించనున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించనున్నారు. త్వరలోనే షూటింగ్ ప్రారంభం కానుంది.

New Update

Niharika:  మెగా ప్రిన్సెస్ నిహారిక తెలుగు ఇండస్ట్రీలో నటిగా, ప్రొడ్యూసర్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది.  ముద్దపప్పు ఆవకాయ్, నాన్న కూచి, ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ,  హలో వరల్డ్ వంటి వెబ్  సీరీస్ లతో సక్సెస్ ఫుల్ నిర్మాతగా పేరు తెచ్చుకున్న నిహారిక.. గతేడాది  'కమిటీ కుర్రోళ్ళు' తో ఫీచర్ ఫిల్మ్ నిర్మాణంలోకి అడుగుపెట్టింది. ఆగస్టు 2024లో విడుదలైన ఈ చిత్రం  బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. అతి తక్కువ బడ్జెట్ తో అత్యధిక వసూళ్లు సాధించింది. 

Also Read: కొడాలి నానిని కాపాడేందుకు రంగంలోకి డాక్టర్ పాండా.. ఆయన ట్రాక్ రికార్డ్ తెలిస్తే షాక్ అవుతారు!

మ్యాడ్ హీరోతో 

ఇదిలా ఉంటే.. తాజాగా తన సొంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్  మరో సినిమాను అనౌన్స్ చేసింది నిహారిక. 'మ్యాడ్ ' ఫేమ్ సంగీత్ శోభన్ హీరోగా తన రెండవ ఫీచర్ ఫిల్మ్ నిర్మాణాన్ని ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ నిహారిక సోషల్ మీడియాలో పోస్టర్ రిలీజ్ చేసింది. త్వరలోనే మూవీ షూటింగ్ ప్రారంభం కానున్నట్లు తెలిపింది. ఈ చిత్రానికి మానస శర్మ  దర్శకత్వం వహించనున్నారు. మానస గతంలో నిహారిక నిర్మించిన వెబ్ సీరీస్ లకు క్రియేటివ్ డైరెక్టర్ గా పనిచేసింది. మిగిలిన నటీనటులు,  సిబ్బంది గురించి మరిన్ని వివరాలు రాబోయే రోజుల్లో ప్రకటించనున్నారు.

ఓవైపు ప్రొడ్యూసర్ గా సినిమాలు నిర్మిస్తూనే .. మరోవైపు నటిగా రాణిస్తోంది నిహారిక. ఇటీవలే తమిళ్ లో 'మద్రాస్కారన్' సినిమాతో అలరించింది. ప్రస్తుతం తెలుగులో 'What the Fish' సినిమా చేస్తోంది. వరుణ్ కొండూరు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నిహారిక  'అష్టలక్ష్మి' అనే మోడ్రన్ పాత్రలో కనిపించనుంది.  

telugu-news | latest-news | cinema-news | Sangeeth Shobhan

Also Read: రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!

Advertisment
Advertisment
Advertisment