Nidhhi Agerwal: ప్రభాస్ హీరోయిన్ కు చంపేస్తామని బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన నటి

హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనను సోషల్ మీడియాలో వేధిస్తున్న వ్యక్తిపై కేసు పెట్టింది. ఆ వ్యక్తి  తనను చంపేస్తానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పంపిస్తున్నాడని పేర్కొంది. ఆమె కంప్లైంట్ తో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

New Update
niddhi agerwal

niddhi agerwal

టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనను సోషల్ మీడియా ద్వారా వేధిస్తున్న వ్యక్తిపై కేసు పెట్టింది. ఫిర్యాదులో, ఆ వ్యక్తి  తనను చంపేస్తానంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పంపిస్తున్నాడని పేర్కొంది. అలాగే, తనతో పాటు తనకు ఇష్టమైన వ్యక్తులను టార్గెట్ చేస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు పంపుతున్నట్లు నిధి వెల్లడించింది. 

ఈ బెదిరింపుల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నానని, నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరింది. ఆమె కంప్లైంట్ తో  రంగంలోకి దిగిన సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉంటే.. నిధి అగర్వాల్ ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. 

ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి స్టార్స్ పక్కన నటిస్తోంది. వీటిలో మారుతి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘రాజా సాబ్’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కామెడీ హారర్ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటూ మాళవిక మోహనన్, రిధి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. 

ఇది కూడా చూడండి:  Daaku Maharaaj: బాలయ్యకు బిగ్ షాక్.. డాకూ మహారాజ్ ప్రీ రిలీజ్ క్యాన్సిల్!

సినిమాలో మిగతా ఇద్దరు హీరోయిన్స్ తో పోల్చుకుంటే నిధి అగర్వాల్ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉన్నట్లు సమాచారం. ఈ సినిమా 2024 ఏప్రిల్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. అటు పవన్ కళ్యాణ్ తో నటిస్తున్న 'హరిహర వీరమల్లు' కూడా ఈ ఏడాది మార్చి లో రాబోతుంది. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుండటం విశేషం.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు