/rtv/media/media_files/2026/02/24/bloody-romeo-2026-02-24-16-28-44.jpg)
Bloody Romeo
Bloody Romeo: న్యాచురల్ స్టార్ Nani పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా టైటిల్‌ను అధికారికంగా ప్రకటించారు. దర్శకుడు సుజీత్ Sujeeth తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి బ్లడీ రోమియో Bloody Romeo అనే పేరు పెట్టారు. టైటిల్‌ను ప్రకటిస్తూ ఒక స్టైలిష్ యానిమేటెడ్ వీడియోను విడుదల చేశారు.
Bloody Romeo Glimpse
The title teaser for ‘BLOODY ROMEO’, starring Nani.
— justSP 🍿⊙ (@_justSP) February 24, 2026
Sujeeth (‘Saaho’) is directing
Filming begins in Summer 2026.pic.twitter.com/IUXcWLr26z
ఈ సినిమాలో నాని పూర్తిగా కొత్త పాత్రలో కనిపించనున్నారు. బయటకు చూస్తే ఆయన ఒక చెఫ్‌లా కనిపిస్తారు. కానీ అసలు ఆయన ఒక గ్యాంగ్‌స్టర్. ఈ రెండు జీవితాల మధ్య జరిగే సంఘటనలే కథలో ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. “నంబర్ 1 చెఫ్ అండ్ గ్యాంగ్‌స్టర్” అనే లైన్‌తో ఆయన పాత్రను చూపించారు.
ఈ టైటిల్ గ్లింప్స్‌కు “No.1 Gangsta” అనే పాట బ్యాక్‌గ్రౌండ్‌లో వినిపించింది. ఈ పాటను ప్రవీణ్ వేరా సంగీతం అందించగా, కాయో డ్రిప్ పాడారు. వీడియోలో వాయిస్ ఓవర్‌ను వెన్నెల కిషోర్ ఇచ్చారు. యానిమేషన్‌లో నాని ఒక వంటకం తయారు చేస్తూ కనిపిస్తారు. తరువాత సీన్ ఒక్కసారిగా యాక్షన్ వైపు మారుతుంది. దీంతో సినిమా యాక్షన్, వినోదం, ప్రేమ అన్నీ కలిపి ఉంటుందని అర్థమవుతోంది.
ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ ఈ వేసవిలో ప్రారంభం కానుంది. ఈ సినిమాను వెంకట్ బోయనపల్లి, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.
ఇక నాని మరో సినిమా 'The Paradise'లో కూడా నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా 2026 ఆగస్టు 21న విడుదల కానుంది. మొత్తానికి, “బ్లడీ రోమియో”తో నాని మరోసారి భిన్నమైన పాత్రలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు.
Follow Us