/rtv/media/media_files/2025/02/24/EWuduuNJsNyo9ZQm9W7R.jpg)
nani hit 3 movie teaser released occasion of nani birthday special
నాని హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా ‘హిట్3’. ఇవాళ నాని బర్త్ డే సందర్భంగా ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్‌ను మేకర్స్ అందించారు. తాజాగా ఈ మూవీ టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ టీజర్ అద్భుతంగా ఉండటంతో సినీ ప్రియులు, నాని అభిమానులు ఫుల్ ఖుష్ అవుతున్నారు.
వరుస సినిమాలతో
ఇదిలా ఉంటే నేచురల్ స్టార్ నాని ఫుల్ జోష్‌లో ఉన్నాడు. వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. గతేడాది ‘సరిపోదా శనివారం’ సినిమాతో వచ్చి అదరగొట్టేశాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల్ని అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఇందులో భాగంగా శైలేష్ కొలను దర్శకత్వంలో ‘హిట్ 3’ మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన రెండు పార్టులకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది.
ఫస్ట్ పార్ట్‌లో విశ్వక్ సేన్ నటించాడు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో సెకండ్ పార్ట్ తెరకెక్కింది. అందులో అడవి శేష్ హీరోగా నటించాడు. ఈ చిత్రం కూడా బాక్సాఫీసు వద్ద భారీ రెస్పాన్స్‌తో దుమ్ము దులిపేసింది. కలెక్షన్ల పరంగా కూడా అద్బుతమైన వసూళ్లు సాధించింది. ఇప్పుడు ఈ సినిమాకి కొనసాగింపుగా నేచురల్ స్టార్ నాని హిట్ 3తో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తున్నాడు. ఇందులో నాని భిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది.