BIG BREAKING: అల్లు అర్జున్ కేసులో కోర్టు కీలక నిర్ణయం..!

సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌ విచారణ వాయిదా పడింది. ఇవాళ విచారణ జరిపిన నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. గతంలో అల్లు అర్జున్‌కు నాంపల్లికోర్టు 14రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఇవాళ అల్లుఅర్జున్ వర్చువల్‌గా హాజరయ్యాడు.

New Update
NAMPALLY COURT

NAMPALLY COURT - ALLU ARJUN

సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ బెయిల్ పిటిషన్‌ విచారణ వాయిదా పడింది. ఇవాళ విచారణ జరిపిన నాంపల్లి కోర్టు సోమవారానికి వాయిదా వేసింది. కౌంటర్ దాఖలకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరగా.. తదుపరి విచారణను ఈ నెల 30కి నాంపల్లి కోర్టు వాయిదా వేసింది. కాగా ఇవాళ జరిగిన విచారణకు అల్లు అర్జున్ వర్చువల్‌గా హాజరయ్యారు. ఇదిలా ఉంటే సంధ్య థియేటర్ కేసులో ఇటీవల అల్లు అర్జున్‌ను నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. అప్పుడే అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్ విధించింది. అది ఇవాళ్టితో ముగియనుండటంతో కోర్టు విచారణ జరిపింది.

ఏం జరిగిందంటే?

కాగా సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ను పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఆపై నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అల్లు అర్జున్‌కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో అల్లు అర్జున్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. వెంటనే బెయిల్ విషయంలో హైకోర్టును ఆశ్రయించగా.. 4వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. 

ALSO READ: రేవంత్ రెడ్డి గలీజ్‌గా బిహేవ్ చేస్తున్నారు: హీరోయిన్ షాకింగ్ వ్యాఖ్యలు!

దీంతో బన్నీ చంచల్‌గూడ జైలు నుంచి ఆ రాత్రే బయటకొచ్చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ మధ్యంతర బెయిల్ మంజూరు కాపీ తమకు ఇంకా అందలేదని జైలు అధికారులు తెలిపారు. దీంతో ఆ రాత్రంతా బన్నీని జైలులోనే ఉంచారు. మరుసటి రోజు విడుదల చేశారు. 

ALSO READ: పాకిస్తాన్‌లో పుట్టి భారత ప్రధానిగా ఎదిగి...

మరోవైపు సంథ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబానికి రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందించారు. అల్లు అర్జున్ తరఫున రూ.కోటి, దర్శకుడు సుకుమార్ రూ.50 లక్షలు, నిర్మాతలు రూ.50 లక్షలు అందించారు. అలాగే రేవతి కుమారుడు శ్రీతేజ్ సైతం ఇప్పుడిప్పుడే కోలుకుంటుండటంతో అంతా ఊపిరిపీల్చుకుంటున్నారు. 

ALSO READ: విశిష్ట వ్యక్తిని కోల్పోయాం..ప్రధానితో సహా ప్రముఖుల సంతాపం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు