Nagarjuna : తెలంగాణ ప్రభుత్వానికి నాగార్జున సపోర్ట్.. వీడియో వైరల్

కింగ్ నాగార్జున తెలంగాణ టూరిజానికి తనవంతు సపోర్ట్ అందించారు. దేశంలోని టూరిస్టులంతా తెలంగాణకు రావాలని పిలుపునిస్తూ వీడియో పంచుకున్నారు. అందులో రాష్ట్రంలోని అందమైన ప్రదేశాలను వివరిస్తూ మాట్లాడారు. అలాగే తనకు నచ్చిన ఆహారం తదితర విషయాలపై వీడియోలో వివరించారు. 

New Update
nagarjuna

nagarjuna

టాలీవుడ్ సీనియర్ హీరో కింగ్ నాగార్జున తెలంగాణ టూరిజానికి తనవంతు సపోర్ట్ అందించారు. దేశంలోని టూరిస్టులంతా తెలంగాణకు రావాలని పిలుపునిస్తూ ఓ వీడియో పంచుకున్నారు. అందులో తెలంగాణలోని పలు అందమైన ప్రదేశాలను వివరిస్తూ మాట్లాడారు. అలాగే తనకు నచ్చిన ఆహారం తదితర విషయాలపై వీడియోలో వివరించారు. 

ఈ మేరకు నాగార్జున మాట్లాడుతూ..' చిన్నప్పటి నుంచి నేను తెలంగాణ మొత్తం తిరిగాను.  ఇక్కడ అద్భుతమైన ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. జోదేఘాట్‌ వ్యాలీ, మిట్టే, బొగత జలపాతం అందంగా ఉంటాయి. ఇక ఆలయాల విషయానికొస్తే, వరంగల్‌లో వెయ్యి స్తంభాల గుడి, రామప్ప ఆలయం. దీన్ని ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించింది. ప్రతి ఒక్కరూ చూడాలి. 

Also Read : ప్రభాస్ హీరోయిన్ కు చంపేస్తామని బెదిరింపులు.. పోలీసులను ఆశ్రయించిన నటి

నిజంగా ఎంతో అందమైనదే కాదు, ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది. యాదగిరి గుట్ట చాలా సార్లు వెళ్లాను. ఆ ఆధ్యాత్మిక అనుభూతిని మాటల్లో వర్ణించలేను. తెలంగాణ భోజనంలో జొన్నరొట్టె, అంకాపూర్‌ చికెన్‌.. స్నాక్స్‌ విషయానికొస్తే, సర్వపిండి చాలా ఇష్టం. ఇరానీ ఛాయ్‌, కరాచీ బిస్కెట్‌, హైదరాబాద్‌ బిర్యానీ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 

Also Read : మెగా ఫ్యాన్స్ కు సంక్రాంతి ట్రీట్.. థియేటర్స్ లో 'ఓజీ' టీజర్.!

ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలుసు. ఇవన్నీ మర్చిపోలేను. మీతో చెబుతుంటే నా నోరూరుతోంది. ప్రజల ఆదరణ కూడా చాలా బాగుంటుంది. మీరందరూ రండి. తెలంగాణలో ప్రతి ప్రాంతాన్ని ఆస్వాదించండి..' అంటూ వీడియోలో పేర్కొన్నారు. ఈ వీడియోను తెలంగాణ టూరిజం డిపార్ట్ మెంట్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నాగార్జునకు కృతజ్ఞతలు తెలిపింది.

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Krithi Shetty పడుకొని అందాలు ఆరబోస్తున్న ఉప్పెన బ్యూటీ! ఫొటోలు చూశారు

'ఉప్పెన' బ్యూటీ కృతి శెట్టి నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. బాడీకాన్ అవుట్ ఫిట్ లో కృతి ఫోజులు ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.

New Update
Advertisment
Advertisment
Advertisment