RTV Exclusive: కేటీఆర్, సమంత, నేను.. నాగార్జున స్టేట్మెంట్ లో సంచలనం!

మంత్రి కొండా సురేఖ చేసిన తప్పుడు ఆరోపణలతో తమ కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం కలిగిందని నాగార్జున మంగళవారం కోర్టు ముందు స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి తప్పుడు ఆరోపణలు తమను మనోవేదనకు గురి చేసిందని ఆయన వెల్లడించారు.

New Update
Nagarjuna

'' నాగ చైతన్య డైవర్స్ వందశాతం కేటీఆర్ వల్లనే అయింది. ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ హాల్ ను కూలగొట్టొద్దు అంటే సమంతను తన దగ్గరకు పంపాలని కేటీఆర్ డిమాండ్ చేశాడు. దీంతో సమంతను.. కేటీఆర్ దగ్గరకు వెళ్లమని చెప్పి నాగార్జున ఫోర్స్ చేశాడు. నేను వెళ్లనని సమంత చెప్పింది. వింటే విను లేకపోతే వెళ్లిపో అని డైవర్స్ ఇచ్చారు'' అని మంత్రి కొండా సురేఖ చేసిన తప్పుడు ఆరోపణలతో మా కుటుంబ పరువు ప్రతిష్టలకు భంగం కలిగింది. ఎన్నో ఏళ్లుగా కష్టపడి సంపాదించుకున్న పేరు ప్రతిష్టలు అపఖ్యాతపాలయ్యాయి. ఎంతో గౌరవంగా బతుకుతున్న మాపై ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదు అని నటుడు అక్కినేని నాగార్జున మంగళవారం కోర్టులో తన స్టేట్మెంట్ ఇచ్చారు. 

Nagarjuna

నాగార్జున స్టేట్మెంట్

''తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎన్నో ఏళ్లుగా స్థిరపడిన నటుడిని. దాదాపు 4 దశాబ్దాల కెరీర్ తో పాటు ప్రముఖ నటుడిగా, నిర్మాతగా, టెలివిజన్ హూస్ట్ గా స్టూడియో యజమానిగా ఎంతో గుర్తింపు పొందాను. తెలుగులో 90కి పైకి చిత్రాల్లో నటించాను. నా సొంత కృషి, పట్టుదల, ప్రతిభతో ఎంతో గుర్తింపు పొందాను. అంతేకాకుండా 1998లో తొమ్మిది నంది అవార్డులు, మూడు ఫిల్మ్ ఫేర్ అవార్డులతో సహా మరెన్నో ప్రతిష్టాత్మక అవార్డులతో సత్కరించబడ్డాను.

నాతో పాటు నా కుటుంబం కూడా ప్రజల దృష్టిలో ఎంతో ఖ్యాతి, గౌరవాన్ని పొందింది. ముఖ్యంగా సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. నా కొడుకు నాగ చైతన్య కూడా చిత్ర పరిశ్రమలో ప్రశంసలు పొందిన నటుడిగా ఉన్నాడు. అలాగే నా కొడుకు మాజీ భార్య సమంతా సైతం తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్, గుర్తింపు కలిగిన నటి. వారి వివాహం 2017లో ఎంతో గ్రాండ్ గా జరిగింది. కానీ అనివార్య కారణాల వల్ల వారు 2021లో విడిపోయారు. 

వారి విడాకుల విషయంలో మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు యూట్యూబ్, ఫేస్ బుక్, ట్విట్టర్, వాట్సాప్ తో సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్, టెలివిజన్ ఛానల్స్ ప్రసారం చేశాయి. అన్ని పత్రికలు సైతం ప్రచురించాయి. ఆమె రాజకీయ లబ్ధి, సంచలనం కోసం ఉద్దేశపూర్వకంగా ఈ ఆరోపణలు చేశారు. దీని వల్ల మా కుటుంబం మరింత మానసిక క్షోభ అనుభవిస్తోంది. ఆమె ఇలాంటి ఒక తప్పుడు ఆరోపణ చేసిన తర్వాత నాకు కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహోద్యోగుల నుంచి అనేక ఫోన్ కాల్స్ వచ్చాయి.

Nagarjuna,

చాలా మందికి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అందులో యార్లగడ్డ సుప్రియ, వెంకటేశ్వరులు ఈ తప్పుడు వార్తలపై బాధను వ్యక్తం చేశారు. చివరికి సోషల్ మీడియాలో సైతం పబ్లిక్ ప్రకటన చేయవలసి వచ్చింది. ఈ తప్పుడు ఆరోపణల కారణంగా నేను అపఖ్యాతి పాలయ్యాను. ఇది నా జీవితంలోని వ్యక్తిగత, వృత్తిపరమైన అంశాలకు, నా మొత్తం కుటుంబానికి హాని కలిగిస్తుంది. ఆమె అలా మాట్లాడటం వల్ల మా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది. కాబట్టి కొండా సురేఖపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను" అని నాగార్జున కోర్టుకు తెలిపారు. 

మొదటి సాక్షి సుప్రియ స్టేట్మెంట్

ఈ వ్యవహారంపై నాగార్జునతో పాటు మొదటి సాక్షి సుప్రియ సైతం తన స్టేట్మెంట్ ఇచ్చారు. మొదట న్యూస్ ఛానల్స్ లో అక్కినేని ఫ్యామిలీపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలను చూసి ఆశ్చర్యపోయి నాగార్జునకి చెప్పానని అన్నారు. ఆ వ్యాఖ్యలు చూసి తాను కూడా షాక్ అయ్యాని.. ఆ నెక్స్ట్ డేనే నేషనల్ మీడియాలో సైతం ప్రసారమయ్యాని నాగార్జున తనకు చెప్పినట్లు తెలిపారు. ఇక ఈ విచారణ పూర్తయిన తర్వాత కోర్టు ఈనెల 10కి వాయిదా వేసింది. ఆ రోజు రెండో సాక్ష్యంగా వెంకటేశ్వరులు తన స్టేట్మెంట్ ఇవ్వనున్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు