/rtv/media/media_files/2025/02/17/5vWLh3Q5FvN7IhPPeCK3.jpg)
Naga Chaitanya first Akkineni hero to achieve Rs. 100 crore collections with Thandel movie
నాగచైతన్య ‘తండేల్’ మూవీ బాక్సాఫీసు వద్ద తాండవం చేస్తోంది. కనీ వినీ ఎరుగని రీతిలో దుమ్ము దులిపేస్తోంది. రాజులమ్మ జాతర ఎట్టా ఉంటాదో చూపిస్తుంది. ఫిబ్రవరి 7న రిలీజ్ అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌తో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. అంచనాలకు మించి సూపర్ డూపర్ రెస్పాన్స్‌తో కెవ్వుమనిస్తోంది.
Also Read : Health: నెలరోజులు క్రమం తప్పకుండ ఈ పండు తింటే...బరువు పెరగరు!
తాజాగా ఈ సినిమా ఓ అరుదైన మైలురాయిని చేరుకుంది. ప్రపంచ వ్యాప్తంగా రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ మార్క్ రాబట్టి అబ్బురపరచింది. కేవలం 9 రోజుల్లోనే ఈ ఫీట్ అందుకుని అక్కినేని ఫ్యామిలీ, అలాగే ఫ్యాన్స్‌లో ఫుల్ జోష్ నింపింది. ఇక రూ.100 కోట్ల మైలురాయిని నాగచైతన్య తొలిసారి సాధించడంతో ఎనలేని ఆనందంలో మునిగితేలుతున్నాడు.
తొలి అక్కినేని హీరోగా
అంతేకాకుండా అక్కినేని హీరో రూ.100 కోట్ల మార్క్ టచ్ చేయడం కూడా ఇదే తొలిసారి కావడం గమనార్హం. చైతు తప్పించి నాగార్జున, అఖిల్ సహా ఇంకెవరూ ఈ ఫీట్ అందుకోలేదు. దీంతో రూ.వంద కోట్ల మార్క్ క్రాస్ చేసిన తొలి అక్కినేని హీరోగా నాగచైతన్య రికార్డు క్రియేట్ చేశాడు.
#Thandel 💥💥💥💥💥 pic.twitter.com/bgwnllHrUj
— T2BLive.COM (@T2BLive) February 16, 2025
Also read : Aashiqui 3: బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజీతో శ్రీలీల బాలీవుడ్ ఎంట్రీ.. టీజర్ అదిరింది! చూశారా
ఈ సినిమాలో నాగచైతన్య మత్స్యకారుడి పాత్రలో నటించి అదరగొట్టేశాడు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. చందూ మొండేటి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‌గా నటించింది. లవ్, ఎమోషనల్ సన్నివేశాలతో ఈ సినిమా ప్రేక్షకుల్ని విపరీతంగా అలరించింది. ఈ చిత్రానికి ప్రాణం పోసింది మాత్రం మ్యూజిక్ అనే చెప్పాలి. దేవీశ్రీ అందించిన సాంగ్స్ అండ్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్‌లో ఆకట్టుకున్నాయి.
Also Read : Gold Prices: ఎట్టకేలకు దిగొచ్చిన బంగారం ధర.. ఇదే గోల్డెన్ ఛాన్స్!