/rtv/media/media_files/2026/04/15/prabhas-spirit-2026-04-15-13-11-33.jpg)
Prabhas Spirit
Prabhas Spirit: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ Prabhas హీరోగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా Sandeep Reddy Vanga కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా స్పిరిట్ Spiritపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. పోలీస్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా 2027 మార్చి 5న పలు భాషల్లో విడుదల కానుంది. ఇండియన్ భాషలతో పాటు కొరియన్‌లో కూడా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Also Read: గ్లోబల్ స్టేజ్‌పై "బాహుబలి ఆత్మ" కథ.. రాజమౌళి మరో సంచలనం..!
సినిమా నుంచి ఇంకా ఫస్ట్ లుక్ కూడా రాకముందే ట్రేడ్‌లో మంచి క్రేజ్ ఏర్పడింది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం, తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు ఇప్పటికే ఫిక్స్ అయ్యాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు Mythri Movie Makers, People Media Factory ఈ హక్కులను తీసుకున్నాయి. సినిమా గురించి ఏ వివరాలు బయటకు రాకపోయినా, ఈ కాంబినేషన్‌పై ఉన్న నమ్మకం వల్లే ఈ డీల్ జరిగినట్టు తెలుస్తోంది.
ఈ రెండు సంస్థలు డిస్ట్రిబ్యూషన్‌లో మంచి పేరు సంపాదించాయి. ముఖ్యంగా నైజాం ప్రాంతంలో వీరి పట్టు బలంగా ఉంటుంది. పెద్ద సినిమాలను భారీ స్థాయిలో విడుదల చేసే సామర్థ్యం వీరికి ఉంది.
Also Read: "సార్... వన్ మోర్ ఛాన్స్ ప్లీజ్!" బుచ్చిబాబు కామెంట్ వైరల్!
ఈ సినిమాను T-Series, Bhadrakali Pictures నిర్మిస్తున్నాయి. ఇందులో హీరోయిన్‌గా ట్రిప్తీ డిమ్రి Triptii Dimri నటిస్తుండగా, విలన్‌గా వివేక్ ఒబెరాయ్ Vivek Oberoi కనిపించనున్నారు. అలాగే Prakash Raj వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.
Follow Us