L2 Empuraan Controversy: పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో మోహన్ లాల్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రలో నటించిన 'ఎంపురాన్' ఓ వైపు వివాదాలు ఎదుర్కొంటూనే.. మరోవైపు బాక్స్ ఆఫీస్ వద్ద హవా చూపిస్తోంది. సినిమాపై విమర్శలు వస్తున్నప్పటికీ.. జనాలు థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. తొలి వారాంతంలోనే రూ. 200 కోట్ల వసూళ్లను సాధించింది. నాలుగు రోజుల్లో 200 కోట్లు రాబట్టిన తొలి మలయాళ చిత్రంగా 'ఎల్ 2: ఎంపురాన్' రికార్డు క్రియేట్ చేసింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మోహన్ లాల్ ఎక్స్ వేదికగా పోస్టర్ షేర్ చేశారు. ఇప్పటివరకు ఈ రికార్డు 'మంజుమ్మల్ బాయ్స్' మూవీ పేరిట ఉండగా.. ఇప్పుడు ఎంపురాన్ బ్రేక్ చేసింది. మంజూ వారియర్, టోవినో థామస్ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషించారు.
ఇది కూడా చూడండి: ఫైనల్లీ.. క్లీంకార ఫొటో షేర్ చేసిన ఉపాసన.. తాత చేతుల్లో ఎంత ముద్దుగా ఉందో..!
The OVERLORD shatters the 200 crore barrier in style! EMPURAAN makes history!#L2E #Empuraan pic.twitter.com/9xQb2CWiV5
— Mohanlal (@Mohanlal) March 31, 2025
Also Read: Mega 157: తొలి సీన్లోనే అదరగొట్టిన చిరు.. అనిల్ రావిపూడి మూవీ నుంచి అదిరిపోయే వీడియో!
వివాదమేంటి.. ? 24 కట్స్ తో మళ్ళీ
అయితే సినిమాలో గుజరాత్ గోద్రా అల్లర్ల నేపథ్యంలో రూపొందించిన కొన్ని సన్నివేశాలు ఓ వర్గాన్ని అవమానించే విధంగా చిత్రీకరించారని విమర్శలు వచ్చాయి. మత, రాజకీయ విద్వేషాలను రెచ్చగొట్టేలా సినిమా ఉందని, వెంటనే దీనిని బ్యాన్ చేయాలనీ కొందరు మండిపడ్డారు. దీంతో ఈ వివాదంపై నటుడు మోహన్ లాల్ ఇప్పటికే స్పందించారు. ఇబ్బంది కలిగించే సన్నివేశాలను తొలగిస్తామని.. క్షమాపణలు తెలిపారు. కాగా, తాజాగా సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 24 కట్స్ చెబుతూ.. రీఎడిటెడ్ వెర్షన్ రిలీజ్ చేయాలని ప్రకటించింది. బుధవారం నుంచి రీఎడిటెడ్ వెర్షన్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది.
cinema-news | L2: Empuraan | box office collection
Also Read: Cinema: మోహన్ లాల్ ఎంపురాన్ సినిమాపై బీజేపీ గుర్రు..సపోర్ట్ చేస్తున్న కాంగ్రెస్