/rtv/media/media_files/2025/01/19/3twNKNORSzvT7ZLGeSWp.jpg)
manoj mohan babu
మంచు ఫ్యామిలీ గొడవలు రోజు రోజుకు ముదురుతున్నాయి. నిన్న మోహన్ బాబు.. రంగారెడ్డి జిల్లా కలెక్టర్ ను కలిసి జల్ పల్లిలోతన ఇంటిని ఆక్రమించుకున్నారంటూ ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన
ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించారని, వెంటనే వాళ్ళను ఖాళీ చేయించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఆయన ఫిర్యాదుపై మనోజ్‌కు నోటీసులిచ్చిన జిల్లా కలెక్టర్.. విచారణ తర్వాత ఇళ్లు ఖాళీ చేయాలంటూ.. మనోజ్ కు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. మోహన్ బాబు ఫిర్యాదు తర్వాత మనోజ్ కూడా నిన్న కలెక్టర్ ను కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. విచారణ తర్వాత కలెక్టర్ చెప్పినట్లు చేస్తానని అన్నారు. తాజాగా కలెక్టర్ ఆదేశాలతో మంచు మనోజ్ జల్ పల్లిలో ఉంటున్న ఇంటిని ఖాళీ చేయక తప్పదని తెలుస్తోంది.