![chiru and modi](https://img-cdn.thepublive.com/fit-in/1280x960/filters:format(webp)/rtv/media/media_files/2025/01/14/hfdKaRu5YCOAh9sxlgiy.jpg)
chiru and modi Photograph: (chiru and modi )
మెగాస్టార్ చిరంజీవి మళ్లీ మెల్లిగా రాజకీయాలవైపు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా అంటే ఆయన అవుననే సమాధానం చెప్పలేకపోయిన ఆయన అడుగులు మాత్రం అవుననే అంటున్నాయి. ఇటీవల కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీలో తన నివాసంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకల్లో ప్రధాని మోదీతో పాటుగా జాతీయ స్థాయిలోని పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఇందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరైన మోదీకి కిషన్‌రెడ్డితో పాటుగా చిరంజీవి సాగర స్వాగతం పలికారు.
దీంతో చిరంజీవి బీజేపీకి చాలా దగ్గరవుతున్నారన్న చర్చ నడుస్తోంది. దీనికి తోడు త్వరలోనే మోదీ కేబినెట్ లో చిరు మంత్రి కాబోతున్నారన్న ప్రచారం ఊపందుకుంది. అయితే ఈ ప్రచారం కొత్తేమీ కాదనుకోండి. ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకార సభకు మోదీ, చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వేదికపై మోదీ ఇద్దరిని( chiranjeevi, pawan kalyan) లను చెరో పక్కన ఉంచుకుని వారి చేతులు పైకి లేపి విజయ సంకేతాన్ని జనాలకు చూపించారు. దీంతో అప్పటినుంచి చిరంజీవి మళ్లీ రాజకీయాల్లోకి రాబోతున్నారు.. మోదీ కేబినెట్ లో మంత్రిగా చేరబోతున్నారంటూ ప్రచారం సాగింది. దీనికి తోడు కేంద్రం చిరంజీవిని అత్యున్నత పురస్కారంతో సత్కరించడంతో ఆ వార్తలకు మరింత ఊపందుకుంది.
చిరంజీవిని పార్టీలోని చేర్చుకుని రాజ్యసభకు పంపించాలని బీజేపీ ప్లాన్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏపీలో కాపుల ఓట్లు చిరు, పవన్ ద్వారా వస్తాయని బీజేపీ అగ్రనేతలు అంచనా వేస్తున్నారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీకి కాపులందరూ ఓట్లేయకపోయినా పోలైన సుమారు 70 లక్షల ఓట్లలో కాపుల ఓట్లే ఎక్కువన్న విషయం అందరికీ తెలిసిందే.
ఇంకా 9 మందికి ఛాన్స్
ఇక ప్రస్తుతం మోదీ మంత్రి వర్గం సహాయమంత్రులతో కలిపి 72తో ఆగింది. ఇంకా 9 మందికి ఛాన్స్ ఉంది. ఇందులో మిత్రపక్షమైన జనసేన కోటా కూడా ఉంది. దీంతో త్వరలో కేంద్రమంత్రిగా చిరంజీవిని చూడటం ఖాయంగానే కనిపిస్తోంది. 2025 జూన్ లో ఏపీలో నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో ఒకటి చిరంజీవికి కేటాయించే అవకాశం ఉంది. ప్రస్తుతం చిరంజీవి సినిమాలతో బీజీగా ఉన్నప్పటికీ రాజకీయాల్లోకి మళ్లీ రాను అని కూడా చెప్పడం లేదు. మౌనం అర్ధాంగికారం అనుకోవాలా ఏంటో. చూడాలి మరి మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ ఎప్పుడు మొదలు అవుతుందో. కాగా 2012-14 మధ్య మాజీ ప్రధాని మన్మోహన్ కేబినెట్‌లో చిరంజీవి కేంద్ర పర్యాటకశాఖ మంత్రిగా పనిచేసిన సంగతి తెలిసిందే.
Also read : సుజాత లేని గేమ్ ఛేంజర్.. ఎవరీ రంగరాజన్ .. శంకర్ పని అయిపోయనట్టేనా!