Prabhas Spirit Movie Updates: 'స్పిరిట్' లో మెగా హీరో.. ఏం ప్లాన్ చేస్తున్నావ్ వంగా మావా..!

ప్ర‌భాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న 'స్పిరిట్' మూవీలో, వ‌రుణ్ తేజ్ ఓ కీల‌క నెగిటివ్ పాత్రలో కనిపించేందుకు చ‌ర్చ‌లు జరుగుతున్నాయి. ఈ ఆఫర్ వ‌రుణ్ కు పాన్ ఇండియా రేంజ్ క్రేజ్ తెచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నారు.

New Update
prabhas spirit movie

prabhas spirit movie

Prabhas Spirit Movie Updates: పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) ద‌ర్శ‌కత్వంలో తెరకెక్కుతున్న మూవీ 'స్పిరిట్' ప్రీ ప్రొడక్షన్ దశలో దూసుకెళ్లుతోంది. స్క్రిప్ట్ ను పూర్తిగా లాక్ చేసుకున్న సందీప్, ఇప్ప‌టికే సినిమాకు సంబంధించిన అనేక అంశాలపై ఫోకస్ పెట్టి ఫుల్ బిజీగా ఉన్నారు. ఈ మూవీలో పాత్ర‌లకు అనుగుణంగా సరైన న‌టీన‌టుల ఎంపికపై సందీప్ ఎక్కువ‌గా ఫోకస్ పెడుతున్నారు. 'స్పిరిట్' మూవీకి సంబంధించిన టెక్నిక‌ల్ టీమ్ ఫైనల్ అయినట్లు వార్తలు రాగా, కీల‌క న‌టీన‌టుల ఎంపిక మాత్రం ఇంకా ఫైనల్ అవ్వాల్సిఉంది.

'స్పిరిట్'లో మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్..?

ఇలా ఉండగా, ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆస‌క్తికర‌మైన విషయం లీకైంది. 'స్పిరిట్'లో ఓ ముఖ్యమైన పాత్రకు మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్(Varun Tej) ను తీసుకునే ఆలోచన జ‌రుగుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సందీప్, వ‌రుణ్ తో చ‌ర్చ‌లు మొద‌లుపెట్టినట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే, ఈ చ‌ర్చ‌లు ఇంకా ఫైనల్ కానప్పటికీ, వ‌రుణ్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో వ‌రుణ్ ఒక నెగిటివ్ పాత్రలో నటించనున్నారని వరుణ్ స‌న్నిహిత వర్గాలు చెబుతున్నారు.

Also Read: జ్యూస్లో విషం కలిపి లవర్ను చంపిన కిలాడీ.. కోర్టు సంచలన తీర్పు

ఈ పాత్రను సందీప్ చాలా పవర్ ఫుల్ గా రాశారని, దీనికి సరిపోయే నటుడు కావాలనే దృష్టితో వ‌రుణ్ ను సెలెక్ట్ చేయాలి అనుకుంటున్నారని అర్ధమవుతుంది. సందీప్ సినిమాలలో హీరో-విల‌న్ పాత్రలు చాలా బలంగా ఉంటాయి, దీనికి ఉదాహరణ 'యానిమ‌ల్' ప్రూవ్ చేసింది. 'స్పిరిట్'తో కూడా అద్భుతమైన పాత్రలను ప్రేక్షకులకు అందించే లాగా సందీప్ ప్లాన్  చేస్తున్నాడు. 

Also Read: Akkineni Akhil: అఖిల్ పెళ్ళి డేట్ ఫిక్స్.. ఆరోజు నుంచి ఘనంగా పెళ్లి వేడుకలు

అయితే, వ‌రుణ్ తేజ్ ఈ సినిమాలో ఉండబోతున్నాడా? లేదా అనే అంశం సందీప్, వ‌రుణ్ లపై ఆధార‌పడి ఉంది. కానీ, ఈ అవకాశం నిజ‌మే అయితే వ‌రుణ్ కి బంపర్ ఆఫర్ అని చెప్పవచ్చు. ఒకే ఒక సినిమా ద్వారా వ‌రుణ్ పాన్ ఇండియా స్థాయిలో పెద్ద హిట్ సాధించే అవకాశం ఉంది. గతంలో, వరుణ్ తేజ్ పాన్ ఇండియా సినిమా చేసినప్పటికీ ఆశించిన ఫలితం రాలేదు. అయితే, 'స్పిరిట్' మూవీలో వరుణ్ ను ఎంపిక చేస్తే, క్రేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది.

Also Read: Bigg Boss: ఫ్యాన్స్ కి షాక్! ఇకపై బిగ్ బాస్ కి కొత్త హోస్ట్.. షోకు గుడ్ బై చెబుతూ హీరో పోస్ట్!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు