/rtv/media/media_files/2025/02/03/6GQUpNXFJS0rYoE7ZeoX.jpg)
lavanya tripathi sathi leelavathi movie launched with pooja ceremony
నటి లావణ్య త్రిపాఠి ఒకానొక సమయంలో టాలీవుడ్‌లో క్రేజీ హీరోయిన్‌గా నిలిచింది. ఎన్నో సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ చివరకు మెగా హీరోతో ప్రేమలో పడి పెళ్లి చేసుకుంది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్‌తో కొన్నాళ్లు ప్రేమాయణం జరిపి.. ఆ తర్వాత పెళ్లి పీటలెక్కింది. దీంతో సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది.
ఇక పెళ్లై ఏడాదికి పైగా అవుతున్నా ఆమె సినిమాల జోలికి పోలేదు. మెగా కోడలు అయ్యాక లావణ్య పూర్తిగా ఇంటికే పరిమితం అయింది. దీంతో చాలా మంది ఆమె ఇకపై సినిమాలు చేస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వారి అనుమానాలకు లావణ్య చెక్ పెట్టింది.
Also Read: పార్లమెంట్ ను కుదిపేసిన కుంభమేళా తొక్కిసలాట
మెగా కోడలి కొత్త చిత్రం
లావణ్య త్రిపాఠి లీడ్ రూల్‌లో ఒక సినిమాకు శ్రీకారం చుట్టింది. ఇవాళ ఆ సినిమాను మేకర్స్ అనౌన్స్ చేశారు. భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్ఎంఎస్ సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు తాతనేని సత్య దర్శకత్వంలో సినిమా చేస్తుంది. ఈ చిత్రానికి ‘సతీ లీలావతి’ అనే టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేశారు. ఇవాళ ఈ చిత్రం పూజా కార్యక్రమాలు రామోజీ ఫిల్మ్ సిటీలోని సంఘి హౌస్‌లో జరిగాయి. ఈ వేడుకలో మూవీ యూనిట్‌తో పాటు లావణ్య త్రిపాఠి భర్త, మెగా హీరో వరుణ్ తేజ్ పాల్గొన్నారు.
Feel-good romantic drama #SathiLeelavathi starring Lavanya Tripathi & Dev Mohan, launched with a pooja ceremony.
— IndiaGlitz Telugu™ (@igtelugu) February 3, 2025
Directed by Tatineni Satya, Produced by Durga Devi Pictures & Trio Studios, the shoot has officially begun! pic.twitter.com/lOG2oNp2Z2
Also Read: రైల్వే శాఖ కీలక నిర్ణయం.. ఇకపై ఆ వందే భారత్‌లో నాన్ వెజ్ నిషేధం
ఈ చిత్రంలో మలయాళ నటుడు దేవ్ మోహన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. దుర్గాదేవి పిక్చర్స్, ట్రియో స్టూడియోస్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని మోహన్ బాబు. ఎమ్, రాజేష్.టి కలిసి నిర్మిస్తున్నారు. మరి ఈ చిత్రం లావణ్యకు ఎలాంటి కంబ్యాక్ ఇస్తుందో చూడాలి. దీనికి మిక్కీజే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు.