/rtv/media/media_files/2025/02/15/WWTuju54yJdB39I9aNHi.jpg)
Mastan Sai 14 days remand Ranga Reddy court judge on nude videos and drugs case
న్యూడ్ వీడియోలు, డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయికి (Masthan Sai) కోర్టు రిమాండ్ విధించింది. ఈ కేసుపై విచారణ జరిపిన రంగారెడ్డి కోర్టు న్యాయమూర్తి మస్తాన్ సాయికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. నగ్న వీడియోలు, డ్రగ్స్ కేసులో మూడు రోజుల పాటు మస్తాన్‌సాయిని క్రైం బ్రాంచ్ పోలీసులు విచారించారు.
Also Read : మరో బ్యూటీతో లలిత్ మోదీ రాసలీలలు.. లవర్స్ డే స్పెషల్ పోస్ట్.. ఆ అందగత్తే ఎవరో తెలుసా!
సైబరాబాద్ నార్కొటిక్స్ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. ఇక నేటితో తమ కస్టడీ పూర్తవడంతో మస్తాన్ సాయికి పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం అతడిని కోర్టులో హాజరుపరిచారు. దీంతో ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి మస్తాన్ సాయికి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దీంతో మస్తాన్ సాయిని చంచల్ గూడ జైలుకు తరలించారు.
Also Read: ఆ విషయంలో భర్త బలవంతం చేసినా తప్పుకాదు: హైకోర్టు
విచారణలో కీలక అంశాలు వెల్లడి
మస్తాన్ సాయిని కస్టడీకి తీసుకున్న పోలీసులు మూడు రోజుల పాటు విచారించారు. ఈ విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇందులో డ్రగ్స్ సరఫరా, అమ్మాయిల నగ్న వీడియోలు, లావణ్య హత్యకు కుట్ర వంటి అనేక అంశాలపై విచారించారు. అక్కడే మస్తాన్‌సాయి ముందే హార్డ్‌డిస్క్ ఓపెన్ చేశారు. అందులో ఉండే విషయాలతో పోలీసులు ఖంగుతిన్నారు.
Also Read : USA: ట్రంప్, మస్క్ కలిసి ఉద్యోగాలు పీకేస్తున్నారు..ఇప్పటికి 10వేల మంది అవుట్
ఒక్కో యువతికి ఒక్కో ఫోల్డర్‌ను మస్తాన్‌సాయి మెయింటేన్ చేసినట్లు గుర్తించారు. అంతేకాకుండా ఫోల్డర్‌లో వాట్సాప్ ఛాట్, ఆడియో, వీడియో, స్క్రీన్ రికార్డింగ్స్ సహా మొత్తం 44మంది యువతులకు సంబందించిన 250 న్యూడ్ వీడియోలను పోలీసులు గుర్తించారు. దీంతో విచారణ అనంతరం కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ మేరకు కోర్టు మస్తాన్ సాయిని రిమాండ్‌కు తరలించాలని ఆదేశించింది.