/rtv/media/media_files/2025/03/29/sQEKM5LoqXTR8hmdpHSs.jpg)
kannappa postponed
మంచు విష్ణు బిగ్ షాకిచ్చారు. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం కన్నప్ప చిత్రాన్ని వాయిదా వేస్తున్నట్లుగా వెల్లడించారు. వీఎఫ్‌ఎక్స్ పనులకు మరింత సమయం కావాల్సి రావడంతో సినిమా వాయిదా వేసినట్లు ప్రకటించారు. ఇందుకు ఆయన సినీ ప్రియులకు క్షమాపణలు చెప్పారు. వాస్తవానికి 2025 ఏప్రిల్ 25న విడుదల కావాల్సిన ఈ మూవీ వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ను కూడా మంచు విష్ణు ప్రకటించలేదు. పాన్ ఇండియా మూవీగా వస్తోన్న ఈ సినిమాపై అభిమానుల్లో చాలా అంచనాలున్నాయి.
Also read : భర్త దుబాయ్లో సంపాదిస్తే.. భార్య ప్రియుడికి ఖర్చు పెట్టింది.. పాపం చివరకి
My Sincere Apologies! pic.twitter.com/WbAUJIVzHq
— Vishnu Manchu (@iVishnuManchu) March 29, 2025
భారీ బడ్జెట్‌తో కన్నప్ప
మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ భారీ బడ్జెట్‌తో రూపొందుతోంది. ఇప్పుడు అందరి చూపు ఈ సినిమాపైనే ఉంది. దాదాపు రూ.100 కోట్లకు పైగా బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం మంచు విష్ణు ఎంతో కేర్ తీసుకుంటున్నాడు. దీనికోసం చాలా కష్టపడుతున్నాడు. ఇందులో స్టార్ క్యాస్టింగ్ భాగమవడంతో అంచనాలు తారాస్థాయికి చేరాయి. ప్రీతి ముకుందన్ ఫీమెల్ లీడ్‌లో నటిస్తోంది.
Also read : రేషన్ కార్డులదారులకు గుడ్ న్యూస్..ఆ గడువు పొడిగింపు
ఇక ఇందులో మోహన్ బాబుతో పాటు మలయాళ స్టార్ మోహన్‌లాల్, కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్, కాజల్ అగర్వాల్ తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, సాంగ్స్, టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఇండియాస్ మోస్ట్ పాపులర్ ప్రభుదేవ కొరియోగ్రఫీ చేస్తుండగా.. మెలోడీ మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్నారు. స్వయంగా మోహన్ బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also read : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐపీఎస్ అధికారి దుర్మరణం!
Also read : చావుకు వెళ్తే చచ్చేంత పనైంది.. శవాన్ని నడిరోడ్డుపైనే వదిలేసి పరుగో పరుగు!