/rtv/media/media_files/2025/01/18/F26sWabOivR0TbnD12kQ.jpg)
manchu manoj
గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న మంచు కుటుంబం వివాదం తాజాగా రంగారెడ్డి కలెక్టరేట్ వరకు చేరింది. మంచు మోహన్ బాబు రంగారెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తూ, జల్ పల్లిలోని తన ఇంటిని కొంతమంది ఆక్రమించారని, ఇంటిని ఖాళీ చేయించాలంటూ విజ్ఞప్తి చేశారు. దీనిపై కలెక్టర్, ఆ ఇంట్లో నివసిస్తున్న మంచు మనోజ్‌కు నోటీసులు పంపారు.
ఈ సందర్భంలో మంచు మనోజ్ రంగారెడ్డి కలెక్టర్‌ను కలిసి వివరణ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, "న్యాయం జరిగే వరకు నా పోరాటం ఆగదు. నా విద్యార్థుల హక్కుల కోసం నిలబడ్డానని నాపై కక్షగట్టారు. మా అన్నయ్య మా నాన్నను అడ్డం పెట్టుకొని చేస్తున్న ఈ నాటకం ఆడుతున్నాడు.
Also Read : సైఫ్ అలీ ఖాన్ కు క్షమాపణ చెప్పిన ఊర్వశీ రౌతేలా.. సిగ్గుగా ఉందంటూ పోస్ట్
మాకు ఆస్తి గొడవలేమీ లేవు. నా పోరాటం విద్యార్థుల, కుటుంబ సభ్యుల, బంధువుల కోసమే. నాపై అనేక కేసులు పెట్టారు. చివరికి ఎక్కడైనా కేసు పెట్టినా నేను భయపడను. జిల్లా అదనపు కలెక్టర్ గారికి అన్ని వివరాలు అందజేశాను. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను," అని పేర్కొన్నారు.
జల్ పల్లి ఆస్తి వివాదంపై మాట్లాడుతూ.." నేను ఏ అక్రమాల్లో పాల్గొనలేదు. కూర్చొని మాట్లాడుదాం అని చెప్పాను. నేను పారిపోవడం లేదు, ఎప్పుడైనా పిలిస్తే వస్తాను. ఆస్తి విషయంలో నేను తప్పు చేయలేదు. తిరుపతి యూనివర్సిటీలో విద్యార్థుల కోసం నిలబడ్డాను, అందుకే నాపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. మా నాన్నగారిని నేను ఎప్పుడూ వ్యతిరేకించను. కలెక్టర్ ఆదేశాల ప్రకారం నడుచుకుంటాను. నాకు న్యాయం జరగాలి.." అని మనోజ్ స్పష్టం చేశారు.
Also Read : జేసీ ప్రభాకర్ రెడ్డికి బిగ్ షాక్.. MAAకు మాధవీలత ఫిర్యాదు