మంచు ఫ్యామిలీ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. మొన్న మంచు మనోజ్ తండ్రితో గొడవకు దిగి రచ్చ రచ్చ చేశాడు. ఆ వివాదం ఇప్పుడిప్పుడే ముగుస్తుందనుకుంటే అంతలోనే మంచు విష్ణు ఇంకో వివాదానికి తెర లేపాడు. తాజాగా ఆయన సిబ్బంది జల్‌పల్లిలోని అటవీ ప్రాంతంలో అడవి పందులను వేటాడినట్లు తెలుస్తోంది. విష్ణు సిబ్బందిలోని మేనేజర్ కిరణ్ చిట్ట అడవిలోకి వెళ్లి అడవి పందులను వేటాడాడు. వేటాడిన అడవి పందిని ఎలక్ట్రిషన్ దేవేంద్ర ప్రసాద్ బంధించి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఇలా అడవి పందులను బంధించి వేటాడటం తప్పు అని మంచు మనోజ్ పలుమార్లు అభ్యంతరం చెప్పినా కూడా విష్ణు సిబ్బంది వినలేదు. అయితే అడవి పందులను బంధించి తీసుకెళ్తున్న వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియా అంతటా వైరల్ అవుతున్నాయి.