/rtv/media/media_files/2025/02/13/795jwRR41RXc4OkVMZFj.jpg)
bramayugam
Bramayugam: మమ్ముట్టి ప్రధాన పాత్రలో తెరకెక్కిన మూవీ ‘భ్రమయుగం’. ఈ సినిమాని యూకే ఫిల్మ్ స్కూల్‌లో కేసు స్టడీ గా చేసారు. ఈ సినిమాను సౌండ్ డిజైన్ పరంగా, హాలీవుడ్ "హారీ పోటర్" సిరీస్‌తో పోల్చి పాఠాలు ఇవ్వడమే కాక, ఒక స్టూడెంట్ ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో షేర్ చేసాడు, కాగా "భ్రమయుగం" దర్శకుడు రాహుల్ సదాశివన్ ఆ వీడియోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
Also Read: ఏసీబీ వలలో అవినీతి తిమింగలం.. దుబ్బాక రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ అరెస్ట్
బ్లాక్ అండ్ వైట్ థీమ్‌తో రూపొందించిన ఈ పీరియాడిక్ హారర్ థ్రిల్లర్ సినిమా భారతీయ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ₹27 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించి ₹85 కోట్ల వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో ఓ యువకుడు పాడుబడిన భవనంలో తాంత్రిక విద్యలు నేర్చుకున్న మంత్రగాడి నుంచి ఎలా రక్షించుకున్నాడన్న కథ ఉంటుంది. ఈ సినిమాతో కులవివక్ష, అధికారం మనిషిని ఎలా క్రూరుడిగా మారుస్తుందనే అంశాలను చాల చక్కగా చూపించాడు దర్శకుడు. ప్రస్తుతం ఈ మూవీ OTT ప్లాట్‌ఫామ్ "సోనీ లివ్"లో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read: కేరళ నర్సింగ్ కాలేజీ ర్యాగింగ్ కేసులో ఐదుగురు విద్యార్థులు అరెస్ట్
యూకే ఫిల్మ్ స్కూల్లో కేస్ స్టడీగా..
మమ్ముట్టి నటించిన చిత్రం 'భ్రమయుగం' యూకే ఫిల్మ్ స్కూల్లో కేస్ స్టడీగా చేసారు, హారీ పోటర్ సినిమాలతో పోల్చి సౌండ్ డిజైన్ పాఠాలు ఇచ్చారు. ₹27 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ హారర్ థ్రిల్లర్ ₹85 కోట్ల వసూళ్లు సాధించి, ఇప్పుడు 'సోనీ లివ్' OTTలో స్ట్రీమింగ్ అవుతోంది.
Also Read: Kiccha Sudeep: హైదరాబాద్ మెట్రోలో హీరో కిచ్చా సుదీప్.. అక్కడ ఏం చేశారో చూడండి?
Also Read: రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!
#Bramayugam is now part of the curriculum at a prestigious London film school, at least for the time being.
— Friday Matinee (@VRFridayMatinee) February 13, 2025
It has traveled beyond countries, reaching across continents.pic.twitter.com/iSsXEHtrlu