'సలార్' కు ఫస్ట్ నన్నే అడిగారు.. కానీ? స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

ప్రభాస్ 'సలార్' లో ఓ రోల్ కోసం ప్రశాంత్ నీల్.. మాళవిక మోహనన్ ను అడిగారట. ఈ విషయాన్ని ఆమె తాజా ఇంటర్వ్యూలో వెల్లడించారు. 'సలార్' లో తనను ఒక రోల్ కోసం అడిగినప్పుడు ఆ క్షణం ఎంతో సంతోషించానని, కానీ అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ చేయలేకపోయానని తెలిపారు.

New Update
malavika mohanan about salaar

malavika mohanan about salaar

మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్ ప్రభాస్ 'రాజా సాబ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే తమిళంలో దళపతి విజయ్, ధనుష్, విక్రమ్ లాంటి స్టార్స్ తో జత కట్టిన ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు డార్లింగ్ తో రొమాన్స్ చేయనుంది. 

అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ప్రభాస్‌తో కలిసి పని చేయడం గురించి మాట్లాడారు. అలాగే, ఆయనపై తనకున్న అభిమానాన్ని కూడా వ్యక్తం చేశారు. 'బాహుబలి' తర్వాత ప్రభాస్‌ మీద తనకు ప్రత్యేకమైన అభిమానం పెరిగిందని వెల్లడించారు.

Also Read: ఆరోజు 'పుష్ప' నిర్మాతలే థియేటర్ తీసుకున్నారు.. నోటీసులపై సంధ్య థియేటర్ రిప్లై

" 'రాజాసాబ్‌' సినిమాతో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్నా. ఈ చిత్రం హారర్‌, రొమాంటిక్‌ కామెడీ జానర్‌లో ఉంటుంది. ఈ సినిమా షూటింగ్ కోసం నేను కొంతకాలంగా హైదరాబాద్ లోనే ఉంటున్నా. ప్రభాస్‌తో పని చేయడం చాలా సరదాగా ఉంటుంది. నేను ‘బాహుబలి’ సినిమాకు పెద్ద ఫ్యాన్. 

ప్రభాస్‌కు పెద్ద ఫ్యాన్..

బాహుబలి 1, 2’ చిత్రాలు చూసిన తర్వాత నేను ప్రభాస్‌కు అభిమానిని అయ్యా. ఆయనతో ఒక్కసారైనా వర్క్ చేయాలని కలలు కన్నా. అలాంటి సమయంలో నాకు ‘సలార్‌’ నుంచి అవకాశం వచ్చింది. ప్రశాంత్‌ నీల్‌ ఒక రోల్‌ కోసం అడిగారు. ఆ క్షణం ఎంతో సంతోషించా. నా కల నెరవేరుతుందనుకున్నా. 

 యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్

'సలార్' లో నటించలేకపోయా..

అనుకోని కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్‌ చేయలేకపోయా. కొన్ని నెలల తర్వాత మారుతి నుంచి ‘రాజాసాబ్‌’ కోసం ఆఫర్‌ వచ్చింది. నేను ఆశ్చర్యపోయా.  ప్రభాస్‌ మూవీతో నేను తెలుగులోకి ఎంట్రీ ఇవ్వాలని రాసి పెట్టి ఉన్నట్టు ఉంది.." అంటూ చెప్పుకొచ్చారు. 

ఇక 'రాజాసాబ్' విషయానికొస్తే.. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మాళవిక తో పాటూ నిధి అగర్వాల్, రిద్ది కుమార్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఏప్రిల్ 10 న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు