/rtv/media/media_files/2025/03/23/7NTZ3MbwXpdb1MWiorU3.jpg)
Mahesh Babu
Mahesh Babu: మహేష్ రాజమౌళి(Rajamouli) కంబోలో తెరకెక్కుతున్న SSMB 29 షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఒడిశా షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ బయటకొస్తున్నాయి. రాజమౌళి అక్కడి కొండలపై ట్రెక్కింగ్ చేస్తూ వీడియో పోస్ట్ చేయగా, మహేష్ బాబు మహేష్ బాబు పర్యావరణాన్ని కాపాడటం కోసమై మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పుడు ఈ ఫొటోస్, వీడియోస్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. వైట్ షర్ట్, బ్లూ జీన్స్ లో సూపర్ స్టార్ పిక్స్ ఇంటర్నెట్ ను షాక్ చేస్తున్నాయి. కొత్త లుక్ లో మహేష్ అల్ట్రా స్టయిలిష్ గా కనిపిస్తున్నాడు.
Also Read: సూర్య ఫ్యాన్స్ కు 'రెట్రో' ట్రీట్.. మరో సాంగ్ రిలీజ్..
పర్వత బాటలో మొక్కలు నాటి..!
SSMB29 షూటింగ్ రెండు రోజుల క్రితం ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో ఒక షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా మహేష్ తో పాటు, చిత్ర దర్శకుడు రాజమౌళి, అతని కుమారుడు కార్తికేయ కూడా దేవమాలి పర్వత బాటలో మొక్కలు నాటి సందడి చేశారు. ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించి ఫోటోలు , షూటింగ్ వీడియోలు చాలానే లీకుల భారిన పడుతున్నాయి, కాగా తాజాగా ఒడిశాలో పూర్తి చేసుకున్న షెడ్యూల్ నుండి కూడా వీడియో ఒకటి లీక్ అయ్యింది. సెట్‌లో మహేష్, ప్రియాంక చోప్రా జోనాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ కనిపించడం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read: బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై RGV షాకింగ్ కామెంట్స్..
అయితే SSMB29 1000 కోట్ల బడ్జెట్ తో ప్రముఖ నిర్మాత KL నారాయణ నిర్మిస్తుండగా. ఆస్కార్ అవార్డు గ్రహీత స్వరకర్త MM కీరవాణి సంగీతం అందిస్తున్నారు. 2026 లేదా 2027లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది.
Also Read: అలాంటి సాహసం ఎప్పుడూ చేయలేదు.. SSMB 29 పై రాజమౌళి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్
Also Read: "ఛీ ఛీ చండాలం.. యాడ దొరికిన సంతరా ఇది".. ‘అదిదా సర్‌ప్రైజ్’ సాంగ్ రీల్స్ పై నెటిజన్స్ ఫైర్!