Lucky Baskhar: 2024 టాలీవుడ్ కి మంచి బూస్ట్ ఇచ్చింది అని చెప్పొచ్చు. వరుసగా హను మాన్, కల్కి, పుష్ప 2 లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఆ సినిమాల జాబితాలో మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన లక్కీ భాస్కర్ కూడా భాగమైంది. వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.
Also Read: చనిపోయిన పేరెంట్స్ కు కుంభమేళాలో స్నానం.. ఆ కూతురు ఏం చేసిందంటే!-VIDEO VIRAL
ఈ సినిమాతో డైరెక్టర్ వెంకీ అట్లూరి బ్యాంకింగ్ వ్యవస్థ, అవినీతి వంటి అంశాలను చాలా ఇంట్రెస్టింగా ప్రెసెంట్ చేసాడు . లక్కీ భాస్కర్ సూపర్ హిట్ తో ఇంకో రికార్డు క్రియేట్ అయింది. ఈ చిత్రం, ప్రభాస్ నటించిన కల్కిని దాటి మంచి టిఆర్పి సాధించింది.
Also Read: ఇమ్వానికి ఇంటి భోజనం తినిపించిన యంగ్ రెబల్ స్టార్!
లక్కీ భాస్కర్(Lucky Baskhar) టిఆర్పి రికార్డ్..
పాన్ ఇండియా సూపర్ హిట్ కల్కి మూవీ టీవీలో కేవలం 5 టిఆర్పి మాత్రమే సొంతం చేసుకుంది. అయితే, లక్కీ భాస్కర్ సినిమా 8.4 టిఆర్పితో బుల్లితెరపై కూడా సూపర్ హిట్ నమోదు చేసుకుంది. దుల్కర్ సల్మాన్ తెలుగులో స్టార్ హీరో కాకపోయినా, అతడికి ఉన్న క్రేజ్‌కు ఇది అద్భుతమైన టిఆర్పి రేటింగ్ అని చెప్పవచ్చు.
Also Read: ఫోన్ ట్యాపింగ్ కేసులో సంచలన విషయాలు.. ఆ 18 మంది జడ్జిల బ్లాక్ మెయిల్?
ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. టీవీల్లో ఈ రకమైన ఫ్యామిలీ ఎమోషన్ ఎంటెర్టైనెర్స్ ఆడియెన్సుకు బాగా కనెక్ట్ అవుతాయని 'లక్కీ భాస్కర్' ప్రూవ్ చేసింది.