బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్‌పై నిన్న ఉదయం దాడి జరిగిన సంగతి తెలిసిందే. తెల్లవారుజామున ముంబై బాంద్రాలో ఉన్న సైఫ్ నివాసంలో ఓ దుండగుడు దొంగతనానికి ప్రయత్నించాడు. అయితే, ఆ సమయంలో సైఫ్ మేల్కొని అతడిని పట్టుకునే ప్రయత్నం చేయగా, దొంగ కత్తితో దాడి చేసి సైఫ్‌ను గాయపరిచాడు.
ఈ దాడిలో సైఫ్ మెడ, వెన్నెముకతో పాటు శరీరంపై ఆరు చోట్ల గాయాలు అయ్యాయి. వెంటనే సైఫ్ తనయుడు ఇబ్రహీం అలీ ఖాన్ తన తండ్రిని లీలావతి హాస్పిటల్ కి తరలించాడు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
Lilavati hospital में Saif Ali Khan का इलाज करने वाले Dr.Nitin Dange ने बताया अब उनकी हालात कैसी है?#SaifAliKhan #SaifAliKhanAttacked #SaifAliKhanInjured #SaifAliKhanNews pic.twitter.com/dqwPV44Bws
— The Red Mike (@TheRedMike) January 16, 2025
అయితే హాస్పిటల్ కు వచ్చిన సమయంలో సైఫ్ కండీషన్ గురించి తాజాగా డాక్టర్స్ మాట్లాడుతూ..'దుండగుడి దాడిలో సైఫ్ అలీఖాన్ కు తీవ్ర రక్తస్రావమైనా స్ట్రెచర్ ఉపయోగించలేదని, కుమారుడితో కలిసి ఆస్పత్రికి వచ్చే సమయంలో రక్తం వస్తున్నా 'ఒక సింహంలా, రియల్ హీరోలా' నడుచుకుంటూ వచ్చారని చెప్పారు.
వెన్నెముకలో కత్తి మరో 2 MM లోపలికి దిగి ఉంటే సీరియస్ ఇంజురీ అయి ఉండేదని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయనకు పక్షవాతం వచ్చే అవకాశం లేదని.. పూర్తి క్షేమంగా ఉన్నారని వివరించారు. ఐసీయూ నుంచి ప్రత్యేక గదికి మారుస్తున్నట్లు చెప్పారు. కొద్ది రోజుల్లో డిశ్చార్జ్ కూడా చేస్తాం అని వెల్లడించారు.
Also Read : వంద కోట్ల క్లబ్ లో 'సంక్రాంతికి వస్తున్నాం'.. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్