యూట్యూబ్ ను షేక్ చేసిన ఏకైక ఇండియన్ సాంగ్..'కుర్చీ మడతపెట్టి' నయా రికార్డ్

యూట్యూబ్‌.. తమ ప్లాట్‌ఫామ్‌లో టాప్‌లో నిలిచిన పాటల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో 'కుర్చీ మడతపెట్టి’ సాంగ్ ఇండియా నుంచి చోటు దక్కించుకున్న ఏకైక పాటగా నిలిచింది. దీనిపై సంగీత దర్శకుడు తమన్, హీరోయిన్ శ్రీలీల ఆనందం వ్యక్తం చేశారు.

New Update
kurchi madatha petti song

kurchi madatha petti song

ఈ ఏడాది టాలీవుడ్ లో 'కుర్చీ మడతపెట్టి' నుంచి 'కిస్సిక్‌' వరకూ ఎన్నో పాటలు విడుదలయ్యాయి, అయితే వాటిలో కొన్ని సాంగ్స్ మాత్రమే భారీ ప్రేక్షకాదరణ పొంది యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్ అందుకున్నాయి. తాజాగా యూట్యూబ్‌.. తమ ప్లాట్‌ఫామ్‌లో టాప్‌లో నిలిచిన పాటల జాబితాను విడుదల చేసింది. ఇందులో వివిధ దేశాల్లో అత్యంత ప్రజాదరణ పొందిన పాటలను ప్రస్తావించింది.

అమెరికాలో కేండ్రిక్ లామర్ ఆలపించిన ‘నాట్‌ లైక్‌ అజ్‌’ టాప్‌లో నిలవగా, కెనడా మరియు యూకేలో బేసన్ బూన్ పాడిన ‘బ్యూటిఫుల్‌ థింగ్స్‌’ ముందంజలో ఉంది. అలాగే, దక్షిణ కొరియాలో క్యూవెర్‌ బ్యాండ్‌ పాడిన ‘టీబీహెచ్‌’ పాటను ఎక్కువమంది విన్నట్లు తెలిపింది.

Also Read : పవన్ ను ఇబ్బంది పెట్టకండి.. ఫ్యాన్స్ కు 'ఓజీ' మేకర్స్ రిక్వెస్ట్

528 మిలియన్ వ్యూస్ తో..

ఇండియా నుంచి ఈ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక పాట ‘కుర్చీ మడతపెట్టి’ అని యూట్యూబ్‌ వెల్లడించింది. ఈ పాట తెలుగు నుంచి టాప్-1 స్థానాన్ని సాధించింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ వంటి భాషల నుంచి వచ్చిన అనేక హిట్‌ పాటలను పక్కన పెట్టి ‘కుర్చీ మడతపెట్టి’ టాప్‌లో నిలవడం విశేషం.

దీనిపై సంగీత దర్శకుడు తమన్, హీరోయిన్ శ్రీలీల ఆనందం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఎక్స్‌ వేదికగా పోస్ట్‌ పెట్టారు. "ఈ విజయం ‘గుంటూరు కారం’ టీమ్‌ సహకారంతో సాధ్యమైంది" అని పేర్కొన్నారు. పాటను విశేషంగా ఆదరించిన ప్రేక్షకులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. యూట్యూబ్‌లో ఈ ఫుల్‌ వీడియో సాంగ్‌ ఇప్పటిదాకా 528 మిలియన్ల (సుమారు 54 కోట్లకు పైగా) వ్యూస్‌ సొంతం చేసుకుంది.

Also Read: నాగార్జునాసాగర్ దగ్గర హై డ్రామా..భద్రత విషయంలో గందరగోళం

 

Also Read:ఈ ఏడాది రిలీజ్ అయిన టాప్ ప్రీమియం బైక్స్.. ఫీచర్లు పిచ్చెక్కించాయ్!

 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు