Actress Abhinaya: 15 ఏళ్లుగా అతనితో రిలేషన్‌లో ఉన్నాను: విశాల్‌తో పెళ్లిపై నటి అభినయ క్లారిటీ!

హీరో విశాల్‌తో పెళ్లిపై నటి అభినయ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. విశాల్‌తో పెళ్లి వార్తలను ఆమె ఖండించింది. తనకు 15ఏళ్లుగా ఒక వ్యక్తి తెలుసునని.. అతడితోనే రిలేషన్‌లో ఉన్నానని అభినయ క్లారిటీ ఇచ్చింది. ఆ వ్యక్తి మాత్రం హీరో విశాల్‌ కాదని స్పష్టం చేసింది.

New Update
kollywood Actress Abhinaya full clarity on marriage with hero Vishal

kollywood Actress Abhinaya full clarity on marriage with hero Vishal


హీరో విశాల్ - హీరోయిన్ అభినయ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని.. ఇప్పటి వరకు రిలేషన్‌లో ఉన్న వీరు ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటి కాబోతున్నారని గత కొద్ది రోజులుగా వార్తలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఈ వార్తలపై విశాల్ ఇప్పటి వరకు స్పందించకపోగా.. నటి అభినయ మాత్రం ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. 

Also Read: Delhi: ఢిల్లీ ఎన్నికల పోలింగ్  షురూ..కేజ్రీవాల్ పై హర్యానాలో ఎఫ్ ఐఆర్

పెళ్లి వార్తలపై క్లారిటీ

తనపై వస్తున్న వార్తలు అవాస్తవమని తెలిపింది. విశాల్‌తో పెళ్లి వార్తలను ఆమె ఖండించింది. తనకు ఆల్రెడీ ఒక బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడని.. అతడితోనే రిలేషన్‌లో ఉన్నానని చెప్పుకొచ్చింది. అయితే ఆ బాయ్‌ఫ్రెండ్ మాత్రం విశాల్ కాదని పేర్కొంది. ఈ మేరకు ఆమె పూర్తి వివరణ ఇచ్చింది. 

Also Read: Cinema: తండేల్ సినిమా టికెట్ల రేట్ల పెంపుకు ఓకే చెప్పిన గవర్నమెంట్

పొట్ట కూటికోసం ఇలా చేస్తున్నారు

తనకు హీరో విశాల్‌కు త్వరలో పెళ్లి జరగబోతున్నట్లు గతకొంత కాలంగా కొందరు ప్రచారం చేస్తున్నారని.. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తెలిపింది. అయితే ఇలా ఎందుకు ప్రచారం చేస్తున్నారో తనకు తెలీదని.. కానీ వారు మాత్రం పొట్ట కూటికోసం ఇలా చేస్తున్నారని తాను అనుకుంటున్నట్లు తెలిపారు. 

Also Read: మూడు గ్రూపులుగా ఎస్సీలు.. ఏ కులం ఏ గ్రూపులో ఉందో తెలుసా?.. ఫుల్ లిస్ట్ ఇదే!

15 ఏళ్లుగా రిలేషన్

ఆ వార్తలను తాను ఎట్టిపరిస్థితుల్లోనూ పట్టించుకోనని అన్నారు. అనంతరం తాను ఒకరితో రిలేషన్‌లో ఉన్నట్లు తెలిపింది. గత 15 ఏళ్లుగా అతను తనకు తెలుసునని.. చిన్న వయసు నుంచే వారిద్దరూ మంచి ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చింది. తన విషయాలన్నీ తనకు తెలుసునని.. ఆయన చాలా మంచి వ్యక్తి అని పేర్కొంది. ఒకరికొకరం అన్ని విషయాలను షేర్ చేసుకుంటామని చెప్పింది. అయితే వారిద్దరి మధ్య ఇప్పటి వరకు పెళ్లి ప్రస్తావన రాలేదని.. దానికి ఇంకా కాస్త టైం ఉందని క్లారిటీ ఇచ్చింది. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు