Kiran Abbavaram K- Ramp: 'కే రాంప్' అంటున్న కిరణ్ అబ్బవరం.. ఇదేం టైటిల్ సామీ..!

'క' సినిమా తర్వాత హీరో కిరణ్ అబ్బవరం తన 11వ ప్రాజెక్ట్‌గా 'కే రాంప్'ను అనౌన్స్ చేసాడు, దీని పూజ కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోలో దిల్ రాజు చేతుల మీదగా ఘనంగా జరిగాయి. లవ్, యాక్షన్ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమాకు జైన్స్ నాని దర్శకత్వం వహిస్తున్నారు.

New Update
kiran abbavaram k ramp movie launch

kiran abbavaram k ramp movie launch

Kiran Abbavaram K- Ramp: లాస్ట్ ఇయర్ 'క' (KA)చిత్రంతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న హీరో కిరణ్ అబ్బవరం(Hero Kiran Abbavaram), ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్‌ను ప్రారంభించబోతున్నాడు. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం నటిస్తున్న 'దిల్ రుబా'(Dilruba Movie) చిత్రం ఈ నెలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక తాజాగా, కిరణ్ అబ్బవరం తన 11వ సినిమాగా 'కే రాంప్'(K-Ramp) అనే కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించాడు. ఈ సినిమా పూజ కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోలో(Ramanaidu Studios) ఈ రోజు జరగగా, ప్రముఖ నిర్మాత, ఎఫ్ఎసీ చైర్మన్ దిల్ రాజు(Dil Raju) ముఖ్య అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టారు. అనంతరం, చిత్ర టీంకి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

హాస్య మూవీస్ బ్యానర్‌లో వస్తోన్న ఈ మూవీని రాజేశ్ దండా(Rajesh Dhanda) నిర్మించనున్నారు. జైన్స్ నాని (Jains Nani)ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మలయాళ ముద్దుగుమ్మ 'యుక్తి తరేజా'(Yukti Thareja) హీరోయిన్, ఈ మూవీ లవ్, యాక్షన్ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనుంది. చిత్రానికి సంగీతం చైతన్య భరద్వాజ్(Chaithan Bharadwaj) అందిస్తున్నారు.

Also Read: Horoscope Today:నేడు ఈ రాశివారికి అనుకున్నది ఒకటి..జరిగేది ఒకటి..సో జర భద్రం!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు