గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'గేమ్ ఛేంజర్' మూవీ జనవరి 10న విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ కు మరో నాలుగు రోజులే ఉండటంతో ప్రమోషన్ కార్యక్రమాలతో మూవీ యూనిట్ చాలా బిజీగా ఉంది. ఇటీవల రాజమండ్రిలో ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా నిర్వహించగా, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేక అతిథిగా హాజరై సందడి చేశారు. ఈ సినిమాలో నెగటివ్ రోల్‌లో కనిపించిన కోలీవుడ్ నటుడు SJ సూర్య, ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ ఆయన గురించి మాట్లాడిన తీరును గుర్తుచేసుకుంటూ, SJ సూర్య భావోద్వేగానికి లోనయ్యారు. Also Read : 'గేమ్ ఛేంజర్' ఈవెంట్ లో ఇద్దరు మృతి.. అండగా నిలిచిన పవన్, దిల్ రాజు ' మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈవెంట్‌కు హాజరై, నా గురించి గొప్పగా మాట్లాడినప్పుడు గూస్‌బంప్స్ వచ్చాయి. ఆయనను హత్తుకున్నప్పుడు కలిగిన ఆనందాన్ని మాటల్లో చెప్పలేను. 'ఖుషి' టైంలో ఆయన ఎలా ఉన్నారో, ఇప్పటికీ ఆయన అదే ఎనర్జీతో ఉన్నారు..' అని చెప్పారు. అలాగే 'ఖుషి 2', పవన్ కుమారుడు అకిరా నందన్ ప్రస్తావన రావడంతో ఆయన స్పందిస్తూ..' ప్రస్తుతం నేను నటుడిగా సంతోషంగా ఉన్నాను. ఇంతలోనే దర్శకత్వం గురించి ఆలోచించడంలేదు. ఇటీవల రాజమండ్రికి వెళ్లినప్పుడు అకిరాను ఫ్లైట్‌లో చూసాను. మొదట గుర్తుపట్టలేకపోయాను. Also Read : భారత్‌లో చైనా కొత్త వైరస్ టెన్షన్ .. లాక్ డౌన్ పక్కానా? అతను చాలా మారిపోయాడు. పవన్ లాగే పుస్తకాలు చదువుకుంటున్నాడు. 'ఖుషి 2' గతంలో పవన్ తో అనుకుంటే చేయలేకపోయాను. భవిష్యత్తులో దేవుడు అవకాశం ఇస్తే, టైమ్ కలిసి వస్తే, అకిరాతో చేయడానికి ఆసక్తిగా ఉన్నాను..' అని తెలిపారు.