పుష్ప-2కు షాక్.. బెనిఫిట్ షోలు రద్దు

పుష్ప 2 సినిమాకు ఊహించని షాక్ తగిలింది. కర్ణాటకలో ఈ మూవీని మిడ్ నైట్, తెల్లవారుజామున ప్రదర్శించవద్దని అక్కడి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఉదయం 6గంటల కంటే ముందు సినిమాను ప్రదర్శించడం చట్ట విరుద్ధమని కన్నడ ప్రొడ్యూసర్‌లు ఫిర్యాదు చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది.

New Update

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 మూవీ మరికొద్ది గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. పుష్ప 2 మేనియాతో దేశం మొత్తం ఊగిపోతోంది. ఈ సినిమాని దాదాపు 6 భాషల్లో 12 వేల స్క్రీన్‌లలో రిలీజ్ చేయబోతున్నారు. ఏపీ, తెలంగాణాలోని చిన్నా, పెద్దా థియేటర్‌లలో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

Also Read: అయ్యో.. ఆ నర్సు గుర్తు పట్టకపోతే.. కులశేఖర్ చనిపోయిన విషయం కూడా తెలిసేది కాదు..! 

ఒక్క తెలుగు ఇండస్ట్రీ మాత్రమే కాకుండా యావత్ భారత దేశం మొత్తం ఈ సినిమా కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ఇందులో భాగంగానే యూఎస్ ప్రీమియర్స్ సహా తెలుగు రాష్ట్రాల్లో కూడా బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు అంతా రెడీ అయింది. ఈ నేపథ్యంలో పుష్ప 2 సినిమాకు ఊహించని షాక్ తగిలింది.

Also Read: ఫడ్నవీస్ కే పట్టం.. ఆయనను మళ్లీ సీఎం చేసిన 6 ముఖ్య కారణాలివే!

కర్ణాటక సినిమా రెగ్యులేషన్ నిబంధన 41 ప్రకారం..

పుష్ప 2 మూవీని కర్ణాటకలో మిడ్ నైట్, తెల్లవారుజామున ప్రదర్శించవద్దని అక్కడి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. నిజానికి ఆ రాష్ట్రంలో ఉదయం 6.30 గంటల కన్నా ముందు షోలు వేయకూడదు.. అలాగే రాత్రి 10.30 తర్వాత షోలు ప్రదర్శించకూడదు. ఇది కర్ణాటక సినిమా రెగ్యులేషన్ నిబంధన 41ని అనుసరిస్తుంది. లైసెన్స్ పొందిన ఏ ఎగ్జిబిటరైనా ఇలానే అక్కడ ఉండాలి.

కానీ పుష్ప2 విషయంలో మాత్రం ప్రభుత్వ అనుమతి లేకపోయినా అర్ధరాత్రి, తెల్లవారుజామున షోలు వేసేందుకు ప్రతి టికెట్ మీద డబ్బులు వసూలు చేశారు. దాదాపు 500 నుంచి 1500 రూపాయల వరకు ప్రతి టికెట్ మీద వసూలు చేశారు. దీంతో ఈ విషయంపై అభ్యంతరం తెలుపుతూ కన్నడ ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ ఫిర్యాదు చేసింది. ఇలా ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం మొదలు పెట్టింది.

Also Read: ప్రేమ పాటలతో యువతను ఉర్రూతలూగించాడు.. కానీ ఆ ఒక్క తప్పే అతని జీవితాన్ని మార్చేసింది? 

ఇందులో భాగంగానే బెంగళూరు కలెక్టర్ ప్రీమియర్ షోలు రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఇది బన్నీ ఫ్యాన్స్‌ని నిరాశ పరిచింది. మరోవైపు టికెట్లు కొనుక్కున్నా లేదా బుక్ మై షోలో కొన్నవాళ్లకు అమౌంట్ రీఫండ్ అవుతుందని తెలిపారు. 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు