బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్‌పై గుర్తు తెలియని వ్యక్తి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. ఈ దాడి కారణంగా సైఫ్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. ప్రస్తుతం ఆయనకు ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై సైఫ్ భార్య, ప్రముఖ నటి కరీనా కపూర్ స్పందించారు.
ఆమె టీమ్ విడుదల చేసిన ప్రకటనలో, " నిన్న రాత్రి సైఫ్ అలీ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ నివాసంలో చోరీకి ప్రయత్నం జరిగింది. చోరీ చేయడానికి వచ్చిన వ్యక్తి సైఫ్ అలీ ఖాన్‌పై కత్తితో దాడి చేశాడు. ఈ దాడి కారణంగా ఆయన చేతికి తీవ్ర గాయాలయ్యాయి. సైఫ్ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కుటుంబంలోని ఇతర సభ్యులంతా సురక్షితంగా ఉన్నారు," అని తెలిపారు.
Also Read : సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల.. డాక్టర్లు ఏం చెప్పారంటే
అసలేం ఏం జరిగిందంటే..
గురువారం తెల్లవారుజామున ముంబైలోని సైఫ్ అలీ ఖాన్ నివాసంలోకి చొరబడిన దుండగుడు దొంగతనానికి యత్నించే క్రమంలో ఆయనపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడి వల్ల సైఫ్ శరీరంపై ఆరు చోట్ల గాయాలయ్యాయి. రెండు చోట్ల తీవ్రమైన గాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు.
వెన్నెముక పక్కన కూడా కత్తిపోటు గాయాలు ఉన్నాయని పోలీసులు వెల్లడించారు.ఈ ఘటన తెల్లవారుజామున 2 గంటల సమయంలో జరిగింది. దుండగుడు దొంగతనానికి ప్రయత్నించగా, అది ఆపే క్రమంలో సైఫ్‌పై కత్తితో దాడి చేశాడు. సుమారు 3.30 గంటల సమయంలో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు.
Also Read : సైఫ్ పై దాడి వెనుక బిష్ణోయ్ గ్యాంగ్.. వెలుగులోకి సంచలన విషయాలు!
ప్రాణాపాయం లేదు..
తాజాగా సైఫ్ అలీ ఖాన్ హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. సైఫ్ వెన్నుముక నుంచి 2.5 అంగుళాల పొడవైన కత్తి ములను తొలగించాం. ఘర్షణ సమయంలో కత్తి విరిగిందని, వెన్నెముకకు తగిలిన గాయమే పెద్దదని తెలిపారు. మెడ పై గాయానికి ప్లాస్టిక్ సర్జరీ చేశామని, ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ కు ఎలాంటి ప్రాణాపాయం లేదని.. సర్జరీ తర్వాత ఆయన్ని ఐసీయూకు తరలించినట్లు వైద్యులు వెల్లడించారు.