Kannappa: మంచు విష్ణు హీరోగా భారీ అంచనాలతో రూపొందుతున్న మైథలాజికల్ డ్రామా 'కన్నప్ప' ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రభాస్, అక్షయ్ కుమార్, ప్రీతి ముకుందన్, మోహన్‌లాల్, ముఖేశ్‌రిషి, కాజల్ వంటి స్టార్ కాస్ట్ నటిస్తుండడం మరింత ఆసక్తిని పెంచుతోంది. రిలీజ్ దగ్గరపడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా కొనసాగిస్తోంది చిత్రబృందం. ఇందులో భాగంగా ఇప్పటికే మూవీ నుంచి రెండు పాటలు విడుదల చేయగా.. తాజాగా మూడో పాట రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.
The roar of Mahadeva Shastri is echoing... 🔥
— Kannappa The Movie (@kannappamovie) March 17, 2025
Faith and fury unite in the #MahadevaShastri Intro Lyrical Song from #Kannappa🏹, releasing on 19th March 🎶
Brace yourself for the Shaivite storm!
⏳ 2 DAYS TO GO
Har Har Mahadev 🔱
Har Ghar Mahadev 🔥@themohanbabu @iVishnuManchu… pic.twitter.com/oDwzw7jir3
మహాదేవ శాస్త్రి ఇంట్రో సాంగ్
ఈ నెల 19న మోహన్ బాబు పుట్టినరోజు సందర్భంగా సినిమాలో ఆయన నటించిన 'మహాదేవ శాస్త్రి' పాత్ర ఇంట్రో సాంగ్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. మహాదేవ శాస్త్రి గర్జన ప్రతిధ్వనిస్తోంది.. మహాదేవ శాస్త్రి పరిచయ గీతంలో కోపం, విశ్వాసం ఏకమయ్యాయి. శైవ తుఫానుకు సిద్ధంగా ఉండండి! అంటూ మోహన్ బాబు పోస్టర్ రిలీజ్ చేశారు.
Also Read: రామరాజ్యం ఆర్మీ పేరుతో అరాచకాలు.. వీరరాఘవరెడ్డి బాగోతం బయటపెట్టిన RTV!