/rtv/media/media_files/2025/03/07/YovEGWVraMxLah1aA1re.jpg)
kannada actor gold case Photograph: (kannada actor gold case)
అందం, అధికారం ఆమె సొంతం. ఓ గౌరవప్రదమైన కుటుంబంలో పుట్టి.. గోల్డ్ స్మగ్లింగ్ దారిని ఎంచుకుంది. బెంగళూరులోని కెంపెగౌడ ఇంటర్‌నేషనల్ ఎయిర్ పోర్ట్‌లో రూ.14.56 కోట్ల విలువైన 14 కిలోల గోల్డ్ స్వాధీనం చేసుకున్న తర్వాత కన్నడ నటి రన్యా రావు అరెస్టయ్యారు. సంవత్సర కాలంలోనే ఆమె 27 సార్లు దుబాయ్ సందర్శించారు. ఈ మధ్యకాలంలో బెంగళూరు ఎయిర్ పోర్ట్‌లో గోల్డ్ స్మగ్లింగ్ రాకెట్ అని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు తెలిపారు.
Also read: Tenth hall tickets: పదో తరగతి పరీక్షల హాల్‌టికెట్లు విడుదల!
రన్యారావు వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉందని వారు అనుమానిస్తున్నారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ కింద పనిచేసే ఏజెన్సీ రన్యారావు తరచుగా దుబాయ్ వెళ్లిరావడంపై నిఘా పెట్టింది. ఈ క్రమంలోనే ఆమె బంగారం అక్రమ రవాణ చేస్తుండగా సోమవారం ఎయిర్‌పోర్ట్‌లో అరెస్ట్ చేశారు. ఆమెను పోలీసులు విచారించడం పూర్తైన కారణంగా 4 రోజులు జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు.
Also Read: TS: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు..తెలంగాణ కేబినెట్ ఆమోదం
దుబాయ్ నుంచి బెంగళూర్‌కు బంగారం అక్రమంగా తీసుకొచ్చినందుకు భారీ మొత్తంలో రన్యా రావు కమిషన్ తీసుకుంటారని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఇన్వెస్టిగేషన్‌లో తేలింది. కిలో గోల్డ్‌కు 4 నుంచి 5 లక్షలు తీసుకుంటుందని తెలింది. ఈ గోల్డ్ స్మగ్లింగ్ దందాలో రాజకీయ నేతలు, అధికారులు ఇలా పెద్ద పెద్ద వారు ఉన్నారని పోలీసులు అనిమానిస్తున్నారు. రన్యా రావు భర్తతో కలిసి ఉంటున్న ఇంట్లో సోదాలు నిర్వహించి రూ.2.06 కోట్ల విలువైన బంగారు ఆభరణాలు, రూ.2.67 కోట్ల భారతీయ కరెన్సీని కూడా స్వాధీనం చేసుకున్నట్లు డిఆర్‌ఐ తెలిపింది.